పల్లెకు ఫైబర్‌నెట్..!

- ఇంటర్నెట్ ఇబ్బందులకు ఫుల్స్టాప్
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు
- నిజామాబాద్‌లో 64, కామారెడ్డిలో 34 జీపీల అనుసంధానం
- ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీ భవనాలకు చేరిన టీ-ఫైబర్
- నెట్ కనెక్టివిటీ ప్రోగ్రాం విజయవంతమైతే పరిపాలనలో మెరుగైన ఫలితాలు
పల్లెలకు డిజిటల్ సొబగులు అద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. సేవల్లో వేగం పెంచే చర్యల్లో భాగంగా పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం అన్ని పనులకు ఇంటర్నెట్ అత్యవసరంగా మారింది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక సేవలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడు జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సైతం ఉన్నది. 98 గ్రామ పంచాయతీ భవనాలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి సేవలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ను అన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తారు. నిజామాబాద్‌లో 64, కామారెడ్డిలో 34 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టు కింద సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీ భవనాలకు ఫైబర్ లైన్ వేయడం పూర్తయ్యింది. త్వరలోనే అన్ని గ్రామాలూ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి.
-నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాలను సర్వాంగసుందరంగా మారుస్తున్న సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. పల్లెలు డిజిటల్ రూపును సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ భవనాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు టీ-ఫైబర్‌ను పూర్తి చేశారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రయోగాత్మక ప్రక్రియను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో సాగుతున్న పైలట్ ప్రాజెక్టులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సైతం ఉండడం విశేషం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 98 గ్రామ పంచాయతీ భవనాలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ను కల్పించి సేవలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆయా జీపీల్లో విజయవంతంగా అమలవుతున్నది. పైలట్ ప్రాజెక్టు అమలుపై పంచాయతీ కార్యదర్శులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీటికీ మాటికి ఆన్లైన్లో వివరాల నమోదుకు మండల కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదని అంటున్నారు.నిజామాబాద్‌లో 64, కామారెడ్డిలో 34 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టు కింద సేవలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు...
నెట్ కనెక్టివిటీ ప్రోగ్రాంను నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మొత్తం 918 గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. నెట్ కనెక్టివిటీ ఇన్స్టాలేషన్ కోసం బీబీఎన్ఆర్ అనే సంస్థతో కలిపి టీ-ఫైబర్ పని చేస్తున్నది. ఒక్కసారి ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక దాని నిర్వహణను టీఫైబర్ చూసుకుంటుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చెబుతున్నది. కంప్యూటర్లు లేని గ్రామాలు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల నుంచి కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు టీ ఫైబర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీ భవనాలకు ఫైబర్ లైన్ వేయడం పూర్తయ్యింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీలు కూడా సొంత నిధులతో కం ప్యూటర్లను సమకూర్చుకుంటున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని గ్రామాలూ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి.
98 గ్రామాలకు తొలి దశ సౌకర్యం...
భవిష్యత్తులో గ్రామాలన్నీ డిజిటల్ రూపు ను సంతరించుకునేలా చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇంటర్నెట్ సేవలు అత్యవసరం అయ్యాయి. సరైన సౌక ర్యం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పడుతున్న అవస్థలు అనే కం. ఇంటర్నెట్ లేకపోవడం, సిగ్నల్ సమస్యల కారణంగా సేవ ల్లో జాప్యం ఏర్పడుతున్నది. పరిపాలనలో డిజిటల్ కాంతులు ప్రజ్వరిల్లే విధంగా గ్రామాలకు టీఫైబర్ను విస్తరింపజేశారు. దీని ద్వారా పంచాయతీ భవనాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మక ప్రక్రియ ఆరంభమైంది. నిజామాబాద్‌లో 530 పంచాయతీలకు గాను 64 జీపీలు ఇందుకోసం ఎంపిక చేశారు. కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలకు 34 జీపీలున్నాయి. మొత్తం 98పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా టీఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నా యి. ఈ ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా టీఫైబర్ ద్వారా ఇంటర్నెట్ను అన్ని పంచాయతీలకు అనుసంధానం చేస్తారు.
టీపైబర్తో మెరుగైన సేవలు...
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాల నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఇటీవల పల్లె ప్రగతి పీఎస్ యాప్, ఇన్స్పెక్షన్ యాప్‌లను తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శి చేపట్టే రోజువారి, నెలవారీ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పల్లె ప్రగతి పనులు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ ఆదా యం, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదులు ఇలా ఏ పని చేసినా ఈ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇవే కాకుం డా ప్రతి నెలా పంచాయతీల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేస్తున్నారు. తాజాగా ఇండ్ల రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్లో పెట్టారు. అయితే, ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్ సిగ్నల్ ప్రధాన అడ్డంకిగా మారింది. మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేక వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతున్నది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే సర్కారు పంచాయతీలకు ఫైబర్ నెట్ సదుపాయం కల్పించనుంది. నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇ కపై ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు సత్వర సేవలు అందుతాయని పంచాయతీ కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
- భారత్‌కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్‌గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్‌పథ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల