Nizamabad
- Dec 25, 2020 , 00:54:18
అర్వింద్.. ఖబడ్దార్
_1608837852.jpg)
- ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు
- జిల్లా వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం..
- ఎంపీ తీరుపై మహిళాలోకం ఆగ్రహం..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్‌పై మహిళలు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా అర్వింద్ దిష్టిబొమ్మలతో గురువారం ర్యాలీలు నిర్వహించి దహనం చేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మోసపూరిత వాగ్దానాలతో గెలిచిన ఎంపీకి కవితను విమర్శించే అర్హత లేదన్నారు. ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖలీల్‌వాడి/కమ్మర్పల్లి/మాక్లూర్/వేల్పూర్/బాల్కొండ (ముప్కా ల్)/డిచ్పల్లి/ఇందల్వాయి/సిరికొండ/నందిపేట్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్‌పై మహిళా లోకం భగ్గుమంది. మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మలను జిల్లా వ్యాప్తంగా గురువారం దహనం చేశారు. నిజామాబాద్ నగరంలో మహిళలు ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్‌లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా ఒక ఎంపీ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని విమర్శించారు. మహిళా లోకం చూస్తూ ఊరుకోదని వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పి మహిళలను గౌరవించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, దండు శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని ధర్నాచౌక్‌లో టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మధుకర్‌రెడ్డి, గులాబ్‌సింగ్, పవన్, శివ, దేవిదాస్, హరికృష్ణ పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాక్లూర్‌లో ఎంపీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు గురువారం ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన కార్యదర్శి సత్యం, సర్పంచులు అశోక్‌రావు, సాయిలు, ప్రవీణ్, ఎంపీటీసీలు సత్యనారాయణ, హైమద్, పీఏసీసీ వైస్ చైర్మన్ రమేశ్, నాయకులు రాజేందర్, రంజిత్, రాముగౌడ్, కృష్ణ, గంగాధర్, విఠల్‌రావు, అబ్బులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఆరోపసలు చేయడం తగదని ఆర్టీఏ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నాగధర్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బాల్కొండలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిచ్పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైస్ ఎంపీపీ శ్యామ్‌రావు, టీఆర్ఎస్ నాయకులు నర్స య్య, చిరంజీవి, మోహన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, నయీం, పద్మారావు, ఆనంద్, దాసరి లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. ఇందల్వాయి మం డల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాశంకుమార్ ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీటీసీ సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ చిన్న ముత్తెన్న, రఘు, శ్రీనివాస్, క్రాంతి, సుధీర్ ప్రవీణ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్వీ రూరల్ జనరల్ సెక్రటరీ చిగురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్, అన్సార్, జశ్వంత్, మోహన్, శేఖర్‌గౌడ్, రియాజ్ పాల్గొన్నారు. నందిపేట్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, నాయకులు హుస్నొద్దీన్, సాగర్, మురళి, భరత్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ వినిత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ధ్యేయం
- 55 బ్లాక్ స్పాట్లు
- ఉగాది నాటికి ‘డబుల్' ఇండ్లు ఇస్తాం
- నియోజక వర్గంలోని అన్ని చౌరస్తాలు అభివృద్ధి
- అంతర్గత రోడ్లకు కొత్తరూపు
- మంచుకొండ.. అభినందనీయం
- అభవృద్ధి పనులు వేగవంతం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
- రోడ్డు విస్తరణకు సన్నాహాలు
- ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’
- కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు
MOST READ
TRENDING