శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 23, 2020 , 01:00:16

శివకేశవనాథ ఆలయ అభివృద్ధికి కృషి

శివకేశవనాథ ఆలయ అభివృద్ధికి కృషి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేశ్‌పల్లి గ్రామంలో పర్యటన

జక్రాన్‌పల్లి : కేశ్‌పల్లి గ్రా మంలోని శివ కేశవనాథ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,  దేవాదాయ శాఖ ద్వారా నిధుల వచ్చేలా చూస్తానని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలో మాజీ ఎంపీ దివంగత గడ్డం కేశ్‌పల్లి గంగారెడ్డి కుమారుడు గడ్డం ఆనంద్‌రెడ్డి సొంత ఖర్చులతో నిర్మిస్తున్న శివకేశవనాథ ఆలయాన్ని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి మంగళవారం  పరిశీలించారు. అనంతరం కవిత మాట్లాడుతూ  గడ్డం గంగారెడ్డి ఎంపీగా ఉన్న రోజుల్లో పుట్టిన ఊరిని, మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నా రు. ఆనంద్‌రెడ్డి సైతం తండ్రి అడుగు జాడల్లో నడవడం అభినందనీయమన్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని కేశ్‌పల్లి గ్రామస్తులు కోరగా ఎమ్మెల్సీ స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రెండు మూడురోజుల్లో ఒక బృందాన్ని పంపుతానని హామీ ఇచ్చారు. గతంలో కేశ్‌పల్లి గ్రామానికి ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ ఢీకొండ హరిత, జడ్పీటీసీ తనూజా రెడ్డి, వైస్‌ ఎంపీపీ కుంచాల విమల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఢీకొండ శ్రీనివాస్‌, కేశ్‌పల్లి సర్పంచ్‌ మహేశ్వర్‌, ఎంపీటీసీ గంగాధర్‌, ఉప సర్పంచ్‌ భాస్కర్‌ గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో పూజలు  

ఖలీల్‌వాడి : ఎమ్మెల్సీగా భారీ విజయం సొంతం చేసుకున్న కల్వకుంట్ల కవిత మొదటి సారి నిజామాబాద్‌ జిల్లాకు వచ్చారు. ఎన్నికలకు ముందుకు బోర్గాం గ్రామంలోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ముడుపు కట్టారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ స్వామి వారిని దర్శించుకుని  ముడుపు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ వెంట నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దండు శేఖర్‌ , సుజీత్‌సింగ్‌ ఠాకూర్‌, సత్యప్రకాశ్‌, ఈర్లశేఖర్‌, ప్రదీప్‌, లక్ష్మి, విశాలిని రెడ్డి  ఉన్నారు.