శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 22, 2020 , 00:04:04

5వేల మందికి క్రిస్మస్‌ కానుకలు

5వేల మందికి క్రిస్మస్‌ కానుకలు

నిజామాబాద్‌ జిల్లాలో పంపిణీ పూర్తి

నియోజకవర్గానికి వేయి చొప్పున..

క్రిస్టియన్లకు కానుకలు పంపిణీ చేసిన రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, 

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ జిల్లాలో క్రిస్టియన్లకు క్రిస్మస్‌ కానుకల పంపిణీ పూర్తయ్యింది. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల వారికి దుస్తులు పంపిణీ చేస్తున్నది. ఈ నెల 25న క్రిస్మస్‌ను పురస్కరించుకొని జిల్లాకు 5 వేల కానుకలు సరఫరా చేసింది. అధికారులు నియోజకవర్గానికి వేయి చొప్పున కానుకలు అందజేశారు. పేదలు పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కానుకలు అందజేస్తున్నది. జిల్లాలో క్రిస్మస్‌ కానుకల పంపిణీకి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రముఖులు, అధికారులు కానుకలను అందజేశారు. కాగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం మేరకు క్రిస్మస్‌ కానుకల పంపిణీ పూర్తి చేసినట్లు మైనార్టీ శాఖ జిల్లా అధికారి రతన్‌ రాథోడ్‌ తెలిపారు. 

అన్ని వర్గాల అభ్యున్నతే కేసీఆర్‌ లక్ష్యం

నిజామాబాద్‌ రూరల్‌ / వర్ని (రుద్రూర్‌) : అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. నిజామాబాద్‌లోని తన నివాసంలో నియోజకవర్గంలోని క్రైస్తవులకు సోమవారం రాత్రి ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్‌, సుమలత, దాసరి ఇందిరా, కమల, ఎంపీపీలు అనూష, సారికారెడ్డి, భూమన్న, లత, సంగీత, రమేశ్‌నాయక్‌, హరిత, తహసీల్దార్లు ప్రశాంత్‌కుమార్‌, వేణుగోపాల్‌గౌడ్‌, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణ, ప్రేమ్‌దాస్‌నాయక్‌, నరేశ్‌, గంగారెడ్డి, ముత్యంరెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. వర్ని మండల కేంద్రంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేశారు. 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు, తహసీల్దార్‌ విఠల్‌, ఎంపీడీవో బషీరుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గిరి, కార్యదర్శి గోపాల్‌, సర్పంచులు రాజు, వెంకన్న, నానిబాబు, కో-ఆప్షన్‌ సభ్యుడు కరీం, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సాయిబాబా, ప్రశాంత్‌, వీర్రాజు పాల్గొన్నారు.