బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 22, 2020 , 00:04:03

ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళి

ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళి

నిజామాబాద్‌ సిటీ/రెంజల్‌/ఆర్మూర్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో చేస్తున్న పోరాటంలో పలువురు రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని, వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ సీపీఎం ప్రజాసంఘాలు, ఐఎఫ్‌ టీయూ, సీపీఐఎంఎల్‌, న్యూడెమోక్రసీ, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నగరంలోని సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయంలో నాయకులు సోమవారం నివాళులర్పించా రు. ఈ సందర్భంగా నాయకుడు సుధాకర్‌ మాట్లాడుతూ.. నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నార న్నారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, నాయకులు ఓమయ్య, రాజురెడ్డి, రాజన్న, విఠల్‌గౌడ్‌, రంజిత్‌, రాజేశ్వర్‌, ఆనందం, మహ్మద్‌, గంగారాం పాల్గొన్నారు. రెంజల్‌ మండలంలోని బోర్గాంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి  అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జిల్లా నాయకుడు నాగన్న, ఒడ్డెన్న, సాయిలు, నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్‌లో నిజాంసాగర్‌ కెనాల్‌ నుంచి కొవ్వొత్తులతో చౌరస్తా వరకు ర్యాలీ నిర్వ హించారు. సీపీఎం ఆర్మూర్‌ కార్యదర్శి వెంకటేశ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దాసు, సీపీఐఎంఎల్‌ కార్యదర్శి ఖాజా, సీపీఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి నాగరాజు, బైక్‌మెకాని క్‌ యూనియన్‌ నాయకుడు నవీన్‌, ఆటో యూనియ న్‌ నాయకుడు ముజీబ్‌, ఐద్వా నాయకురాలు వీణా, డీవైఎఫ్‌ఐ నాయకులు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo