శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Dec 22, 2020 , 00:04:03

నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చర్యలు

నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చర్యలు

ధర్పల్లి/సిరికొండ/రెంజల్‌ : నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్‌ రూరల్‌ ఏడీఏ వెంకటలక్ష్మి హెచ్చరించారు. ధర్పల్లి, సిరికొండ మండల కేంద్రాల్లోని ఎరువుల దుకాణాల్లో ఆమె సోమవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డులతోపాటు ఎరువులు, విత్తనాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తప్పవన్నారు. ఆమెవెంట ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్రవీణ్‌, జాడి వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు. 

రెంజల్‌ మండలం సాటాపూ ర్‌, దూపల్లిలోని ఎరువుల దుకాణాలను బోధన్‌ ఏడీఏ సంతోష్‌కుమార్‌ తనిఖీ చేశారు. వ్యాపారులు ఎరువులు, విత్తనాల విక్రయాలను పీవోఎస్‌ మిషన్‌ ద్వారానే చేపట్టాలని సూచించారు. ప్రభు త్వం  ఎంపిక చేసిన కంపెనీల విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. ఆయన వెంట ఏవో లక్ష్మీకాంత్‌రెడ్డి, ఏఈవోలు ఉన్నారు.


logo