సిద్ధుల గుట్టకు ఘాట్ రూట్

ఏండ్ల నాటి రోడ్డుకు మహర్దశ
ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ చొరవతో అభివృద్ధి పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు
ఆర్మూర్ : పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో ఉన్న ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత చొరవతో ఘాట్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పనులు వేగంగా కొనసాగడంపై ఆర్మూర్, పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఘాట్ రోడ్డుకు మహర్దశ
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిద్ధుల గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రత్యేక ప్రణాళికతో గుట్టపై పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దశాబ్దాలుగా ఇరుకైన ఘాట్‌రోడ్డుతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఘాట్ రోడ్డు విస్తరణకు మున్సిపల్ నుంచి రూ.2కోట్లు విడుదల చేయించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, పీసీ గంగారెడ్డి, భారత్‌గ్యాస్ సుమన్, నక్కల లక్ష్మణ్ తదితరులు సొంత నిధులను వెచ్చిస్తూ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయ్యప్ప శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు సొంత నిధులు వెచ్చించి మందిరాన్ని నిర్మించారు. అసెంబ్లీ సమావేశాల్లో సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు కోసం రూ.7 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విన్నవించారు. పట్టణంలో పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయి. గుట్టపైన క్షత్రియ సమాజ్ కులదైవం సహస్రార్జున మందిరం నిర్మించేందుకు ఎమ్మెల్యే స్థలాన్ని కేటాయించారు. త్వరలోనే మందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతోనే...
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతోనే ఆర్మూర్ సిద్ధులగుట్టపై అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గుట్ట ఘాట్ రోడ్డు మరమ్మతు, వెడల్పు పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నాం. ఘాట్ రోడ్డు వెడల్పు చేయడంతో గుట్టకు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రూ.2 కోట్ల మున్సిపల్ నిధులతో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. త్వరలోనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవతో రూ.7 కోట్లు ఘాట్ రోడ్డుకు మంజూరు కానున్నాయి.
-పండిత్ వినితా పవన్, మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూర్
శరవేగంగా ఘాట్ రోడ్డు పనులు
ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన సిద్ధుల గుట్టకు గతంలో చిన్నగా ఘాట్ రోడ్డును వేయించారు. ఏండ్లు గడిచినా ఈ ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేయించలేదు. సిద్ధుల గుట్టను అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ నిధులు కేటాయించాం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సైతం మంజూరు చేయిస్తాం. ఘాట్ రోడ్డుతోపాటు గుట్టపైన ఇదివరకే అయ్యప్ప మందిరాన్ని నిర్మించాం. త్వరలోనే సహస్రార్జున మందిరం, ధ్యాన మందిరాలను నిర్మిస్తాం. భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కును ఏర్పాటు చేశాం.
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్
తాజావార్తలు
- మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..!
- త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?
- రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!