మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Dec 20, 2020 , 00:21:29

ఘనంగా క్రిస్మస్‌ యూత్‌ ఫంక్షన్‌

ఘనంగా క్రిస్మస్‌ యూత్‌ ఫంక్షన్‌

నిజామాబాద్‌ రూరల్‌ : నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న ఫేత్‌ బాప్టిస్ట్‌ చర్చిలో శనివారం సాయంత్రం యూనియన్‌ ఆఫ్‌ ఇవాంజెలికల్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (స్టూడెంట్స్‌ మినిస్ట్రీ) ఆధ్వర్యంలో క్రిస్మస్‌ యూత్‌ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు, బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. పాస్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, ఫేత్‌ బాప్టిస్ట్‌ చర్చి పాస్టర్‌ అబ్రహం మాట్లాడుతూ యువతీయువకులు సన్మార్గంలో నడిచేందుకు యేసుప్రభు బోధనలు దోహదపడుతాయన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.


logo