శనివారం 23 జనవరి 2021
Nizamabad - Dec 20, 2020 , 00:21:29

‘ఉపాధి’పై అవగాహన ఉండాలి

‘ఉపాధి’పై అవగాహన ఉండాలి

డిచ్‌పల్లి : ఉపాధిహామీ పథకం ద్వారా చేపడుతున్న పనులపై గ్రామపంచాయతీ కార్యదర్శులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలంలోని దేవానగర్‌ క్యాంపును కలెక్టర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులతోపాటు హరితహారం మొక్కలను పరిశీలించారు. రెండువేల మొక్కలతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ప్లాంటేషన్‌ నిర్వహణ సరిగాలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వన సేవకులతో వారికి కేటాయించిన పనులను మాత్రమే చేయించాలని సూచించారు.  ఉపాధిహామీ పనులకు సంబంధించిన ఏడు రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌, ఎంపీడీవో మర్రి సురేందర్‌, ఎంపీవో రామకృష్ణ, సర్పంచ్‌ ఖతిజా యూసుఫ్‌, ఉపసర్పంచ్‌ బుచ్చన్న, కార్యదర్శి శ్రీవాణి తదితరులు ఉన్నారు. 

రికార్డులను సిద్ధంగా ఉంచండి

నిజామాబాద్‌ రూరల్‌: ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను సిద్ధంగా ఉంచాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవ్‌కుమార్‌ పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్‌ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని మల్లారం గ్రామాన్ని ఆయన సందర్శించి పంచాయతీ కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏపీవో పద్మ, పంచాయతీ కార్యదర్శి ఉమాకాంత్‌, ఈజీఎస్‌ టీఏ ప్రభాకర్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు. 

పనుల పరిశీలన 

ధర్పల్లి/సిరికొండ: ధర్పల్లి మండలం సీతాయిపేట్‌ లో అదనపు కలెక్టర్‌ లత పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పల్లెప్రకృతి వనం ఏర్పాటు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాల య రికార్డులను తనిఖీ చేశారు. ఈజీఎస్‌ రికార్డుల్లో పనుల వివరాల నమోదును పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు.  ఆమెవెంట మెప్మా పీడీ, మండల ప్రత్యేకాధి కారి రాములునాయక్‌, సర్పంచ్‌ లొక్కిడి విజయ, నాయకుడు రాములు తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధిహామీ పనులను డీసీవో సింహాచలం తనిఖీ చేశారు. కేంద్ర బృందాలు పనులను పరిశీలించనున్న నేపథ్యంలో పనులకు సంబంధించిన వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పల్లె బాలమణి తదితరులు పాల్గొన్నారు. 


logo