రైతుబంధు వివరాలను సిద్ధం చేయాలి

వివరాల సేకరణ పూర్తయ్యే వరకు అధికారులకు సెలవులు రద్దు
సెల్‌కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందూరు : రైతుబంధుకు సంబంధించిన బిల్లులు ఈనెల 22వ తేదీ తరువాత జనరేట్ అయ్యే అవకాశాలున్నాయని, అంతకంటే ముం దే అర్హులైన రైతులందరి వివరాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెల్‌కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఆయన వ్యవసాయాధికారులతో మాట్లాడారు. రైతుబంధుకు సంబంధించి ఏ ఒక్క రైతు వివరాలను పెండింగ్‌లో ఉంచవద్దని, బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరించి అందజేయాలన్నారు. ఏఒక్క రైతుకూ నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. వివరాల సేకరణ పూర్తయ్యే వరకు అధికారులకు సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి ఆదేశించారని, ప్రతిరోజూ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేయించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, ఎల్డీఎం జయసంతోషి, ఏడీఏలు, ఎంఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
‘ఉపాధి’ రికార్డులను పక్కాగా నిర్వహించాలి
ఉపాధిహామీ ద్వారా గ్రామాల్లో చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని, అందుకు సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ, ఎంపీడీవోలతో సెల్‌కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఉపాధిహామీ ప్రత్యేక కమిషనర్ రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారని, వాటిని వెంటనే అప్టుడేట్ చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులు చేస్తున్నారని, పెద్ద మొత్తంలో కూలి చెల్లిస్తున్నామన్నారు.
త్వరలోనే కేంద్ర బృందం తనిఖీకి వచ్చే అవకాశమున్నదని, పొరపాట్లను పరిశీలించి ఎక్కడైనా రికవరీ పెడితే సంబంధిత అధికారులందరిపైనా రికవరీ ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉంటాయన్నారు. కల్లాల నిర్మాణం, పల్లెప్రకృతివనాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సెల్‌కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర లత, డీఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బిగ్ రిలీఫ్ : భారీగా తగ్గిన బంగారం
- భారత్‌లో ‘మస్క్’ టెస్లా ఎంట్రీ చాలా హాట్ గురూ?!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- బుల్లెట్ల వర్షం కురిపించే బ్లాస్టింగ్ షూస్...!
- నితిన్ ‘చెక్’ విడుదల తేది ఖరారు
- రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
- సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- థాయ్‌లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్