ఆదివారం 24 జనవరి 2021
Nizamabad - Dec 18, 2020 , 02:45:18

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

  • ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

నందిపేట్‌: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నా రు. నందిపేట్‌లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధి దారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అన్ని రాష్ర్టాలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నాయన్నారు. అం తకుముందు చింరాజ్‌పల్లి, ఆంధ్రానగర్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న లింక్‌ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అయిలాపూర్‌ లో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గౌడ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేయగా ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎంపీపీ సంతోష్‌రెడ్డి, జడ్పీటీసీ యమున, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమేశ్‌, నందిపేట్‌, ఆంధ్రానగర్‌, చింరాజ్‌పల్లి సర్పంచులు వాణి, రామారావు, గణేశ్‌ పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

నందిపేట్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నాయకులు గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. చింరాజ్‌పల్లికి చెందిన రాజు, నందిపేట్‌కు చెందిన రాజ్‌కుమార్‌ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఆలూర్‌లో రేణుకా మాత ఎల్లమ్మ ఆలయం ప్రారంభం

ఆర్మూర్‌: మండలంలోని ఆలూర్‌లో రేణుకామాత ఎల్లమ్మ ఆల యాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, గౌడ కులస్తులతో కలిసి గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ హయాంలో ఆలయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తు న్నట్లు చెప్పారు. ఆర్మూర్‌ ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్‌, ఆలూర్‌ సర్పంచ్‌ మోహన్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ భోజకళా చిన్నారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి మల్లేశ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ శ్రీని వాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ కల్లెం భోజారెడ్డి, గౌడ సం ఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

ఆలయ నిర్మాణానికి భూమిపూజ

మాక్లూర్‌: మండలంలోని బోర్గాం(కే) గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న హనుమాన్‌ ఆలయానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్గాం(కే) గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎంపీపీ ప్రభాకర్‌, సీనియర్‌ నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, రజినీశ్‌, శ్రీనివా స్‌గౌడ్‌, సుధాకర్‌, గంగాధర్‌, వీడీసీ అధ్యక్షులు సాయారెడ్డి, శంకర్‌గౌడ్‌, అశోక్‌, సభ్యులు గంగాధర్‌, లింగం, ఒడ్డెన్న, కార్పొరేట ర్‌ రాయిసింగ్‌, పీఏసీసీ డైరెక్టర్‌ అశోక్‌, సర్పంచులు, ఎంపీటీసీ లు, నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..

మాక్లూర్‌ మండలంలోని బోర్గాం(కే) గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ గుగ్గిలం రాజేశ్వర్‌గౌడ్‌ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. విండో చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్‌, గోపులక్ష్మి, సీనియర్‌ నాయకులు వినోద్‌గౌడ్‌, సుక్కి సుధాకర్‌, గంగాధర్‌, సర్పంచులు పాల్గొన్నారు.

అయిలాపూర్‌లో..

నందిపేట్‌ రూరల్‌: మండలంలోని అయిలాపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, సొసైటీ డైరెక్టర్‌ గోపి లాల్‌ ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు. బాధిత కుటుం బాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. తన సొంత డబ్బులు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎంపీపీ సంతోష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు భూమేశ్‌, సర్పంచ్‌ సాయారెడ్డి, సొసైటీ చైర్మన్‌ సుదర్శన్‌, ఎంపీటీసీ రవి, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయిరాం పాల్గొన్నారు. logo