చట్టాలను గౌరవించాలి

- జైలును సంస్కరణ ఆలయంగా మార్చుకోండి
- సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి
- సారంగాపూర్‌లోని జల్లా జైలు సందర్శన
నిజామాబాద్ లీగల్: నేరారోపణలు ఎదుర్కొంటూ జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వారు, న్యాయస్థానాలు శిక్ష ఖరారు చేసిన ఖైదీలు తమలో తాము మార్పు కోసం గట్టి ప్రయత్నాలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి. ఎం.కిరణ్ మహి సూచించారు. గురువారం ఆమె సారంగాపూర్ శివారులో ఉన్న జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఖైదీల యోగక్షేమాలను తెలుసుకున్నారు. మాటామంతీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చట్టాలు చాలా గొప్పవని అన్నారు. వాటిని గౌరవించుకోవడం అంటే మన ల్ని మనం గౌరవించుకోవడమేనని తెలిపారు. పౌరులందరూ స్వేచ్ఛాజీవులని, ఒకరి స్వేచ్ఛను హరించే సాహసం ఎవరూ చేయరాదని సూచించారు. ఖైదీల కోసం చట్టం ఉందని, హక్కులు, బాధ్యతలు సరి సమానంగా స్వీకరించాలని సూచించారు. మంచి, చెడును నిర్ణయించే విచక్షణా జ్ఞానం మనిషి సొంతమని, మంచితనం మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు. జైళ్లను బంధించే కారాగారాలుగా చూడరాదని సంస్కరించుకునే ఆలయాలుగా మార్చుకోవాలని సూచించారు. ఖైదీల హక్కుల కోసం న్యాయ సేవా సంస్థ కృషి చేస్తోందని, న్యాయపరమైన అవసరాలు కలిగిన వారిని ఆదుకోవడంలో అగ్రభాగాన ఉంటామన్నారు. కరోనా వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అనంతరం జైలు పరిసర ప్రాంతాలతో పాటు ఖైదీల బాక్స్, వంట గదులు, వస్తు తయారీ యూ నిట్లు, నర్సరీలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జడ్జి వెంట సంస్థ పర్యవేక్షకుడు పురుషోత్తం గౌడ్, జిల్లా జైలు ఇన్చార్జి శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
- సీఎం కేసీఆర్‌తో నీతి ఆయోగ్ బృందం సమావేశం
- నార్సింగిలో పశువుల జాతర.. వీడియో