పేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం

- దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు
- నిజామాబాద్ జిల్లాలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి
- రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
ఖలీల్‌వాడి : క్రిస్మస్ పండుగ క్రైస్తవుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మైనారి టీ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన క్రిస్మస్ పండుగ సందర్భంగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రిస్టియన్లలో ఉన్న పేదవారు అందరితో సమానంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కులం, మతం ఏదైనా పేదవారు పండుగల సందర్భంలో ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
దుస్తులు పంపిణీ చేయడమంటే డబ్బుతో కూడుకున్నది కాదని మనస్సుతో కూడుకున్న పని అని తెలిపారు. రంజాన్, క్రిస్మస్ పండుగలు వస్తే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, మంత్రి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్డీవోలు అధికారులు పాల్గొనాలని అప్పుడే ప్రభుత్వం తమకు అండగా ఉందని వారికి భరోసా ఏర్పడుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమా లు తలపెట్టలేదని సీఎం కేసీఆర్‌కే అది సాధ్యమైందన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవు ల్లో 99 శాతం మంది నిరుపేదలు ఉన్నారన్నా రు.
పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, వసతి గృహా లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి దరికి చేరుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కిట్ ఇస్తే దాంట్లో మానవత్వం పరిమళిస్తుందన్నారు. నిజామాబాద్‌లో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వారి కోరిక మేరకు 20 గుంటల భూమిలో కమ్యూనిటీహాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. క్రైస్తవులు పాటలతో అతిథులను అలరించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, ఎంపీపీలు రాజ్యలక్ష్మి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, కరుణ సురేందర్, మైనారిటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.