మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Dec 17, 2020 , 03:32:37

న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఇందూరు : న్యాయశాస్త్ర పరిపాలనలో మూడేండ్లు శిక్షణ పొందేందుకు ఎస్టీలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్‌ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంవత్సర ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉన్న వారు అర్హులని స్పష్టం చేశారు. మూడేండ్ల శిక్షణ కాలంలో ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున, రూ.6 వేలు పుస్తకాలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారాలు, వివరాలను జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం నిజామాబాద్‌ నుంచి పొందాలని సూచించారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22న సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని గిరిజనాభివృద్ధి అధికారి తెలిపారు.