రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

- బీబీపూర్ తండా డాంబర్ ప్లాంట్ వద్ద కల్వర్టును ఢీకొన్న బైక్
- అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు
- తిర్మన్‌పల్లి శివారులో ఆటో-బైక్ ఢీ
- తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
- రెండు కుటుంబాల్లో విషాదం
డిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి బీబీపూర్ తండా డాంబర్ ప్లాంట్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొ కరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన కందుకూరి ప్రేమ్‌రాజ్ (38), అతని తమ్ముడు కందుకూరి నరేశ్ ఇద్దరూ కలిసి గురువారం కామారెడ్డిలోని ఓ శుభ కార్యానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నారు. బైక్ నడుపుతున్న నరేశ్ బీబీపూర్ తండా డాంబర్ ప్లాంట్ వద్ద అదపుతప్పి కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా దవాఖానకు తరలించారు. ప్రేమ్‌రాజ్ తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తిర్మన్‌పల్లి గ్రామ శివారులో ..
ఇందల్వాయి : మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న పెట్రోల్ పంపు వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనగా, ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలం కొరట్పల్లి తండాకు చెందిన బానోత్ గణపతి (40), కుమారుడు అనిల్ కలిసి బైక్‌పై ధర్పల్లిలో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా తిర్మన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బానోత్ గణపతి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు అనిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు.
తాజావార్తలు
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం