‘డబుల్' వేగం

- వేల్పూర్,పడగల్లో ముస్తాబవుతున్న రెండుపడకల ఇండ్లు
- మంత్రి వేముల స్వగ్రామంలో చురుగ్గా నిర్మాణాలు
- హర్షం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు
వేల్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు వేల్పూర్ మండలంలో చురుగ్గా సాగుతున్నాయి. మొద టి విడుతగా మండల కేంద్రంలో 120, పడగల్లో 60, మోతెలో 200 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మోతెలో స్థల సేకరణలో కొద్దిగా జాప్యం జగరడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. వేల్పూర్, పడగల్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణా లు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామం లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవల మం త్రి పనులను పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రెండు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయితే లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది వరకే వేల్పూర్, పడగల్ గ్రామా ల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వచ్చి న దరఖాస్తులను అ ధికారులు క్షుణ్ణం గా పరిశీలిస్తున్నా రు. అనర్హులను తొలగిస్తున్నారు. పనులు శరవేగం గా సాగుతుండడం తో నిరుపేదలు హ ర్షం వ్యక్తం చేస్తున్నా రు. త్వరలో సొంతింటి కల సాకారం కానుందని సంబురపడుతున్నారు.
త్వరలో నిరుపేదల సొంతింటి కల సాకారం
మా గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది. అద్దె ఇండ్లల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి డబుల్ బెడ్రూం ఒక వరంగా మారింది.
-మహేశ్, ఎంపీటీసీ, వేల్పూర్
సీఎం కేసీఆర్ పేదల మనిషి
ఇండ్లు కట్టుకోలేక అద్దె ఇండ్లలో ఉంటున్న వారి బాధలు గుర్తించిన సీఎం కేసీఆర్ పేదల మనిషి. అన్ని సౌక ర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తుండడం హర్ష ణీయం. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.
-కమ్మరి నర్సయ్య, వేల్పూర్