సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Dec 08, 2020 , 01:23:32

న్యావనందిలో కొనసాగుతున్న ఆందోళన

న్యావనందిలో కొనసాగుతున్న ఆందోళన

  • ఆర్డీవోతో గ్రామస్తుల చర్చలు విఫలం
  • గంగాధర్‌ మృతదేహాన్ని దించేది లేదనిభీష్మించుకు కూర్చున్న గ్రామస్తులు

సిరికొండ : మండలంలోని న్యావనంది గ్రామంలో తర్రా గంగాధర్‌ (43)ఆదివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతదేహాన్ని  కిందకు దించేది లేదని గ్రామస్తులు  సోమవారం సైతం ఆందోళన కొనసాగించారు. మృతుడు గంగాధర్‌  పుర్రె మమత హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. గంగాధర్‌ ఆత్మహత్యకు పోలీసుల  వేధింపులే కారణం అని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి ఆర్డీవో రవి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యను కలెక్టర్‌కు వివరిస్తామని తెలిపా రు. ఆర్డీవో తిరిగి వెళ్తున్న సమయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలెక్టర్‌ సంఘటన స్థలానికి రావాలని ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆర్డీవో సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. గంగాధర్‌ మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని, మృతుడి కుంటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సహాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని  డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులతో సాయంత్రం వరకు కొనసాగిన చర్చలు విఫలమయ్యాయి.  ఆర్డీవో సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. దీంతో కు టుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన కొనసాగించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌ ఉన్నారు.

దర్యాప్తునకు ప్రత్యేక బృందం 

నిజామాబాద్‌ సిటీ/సిరికొండ : సిరికొండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని న్యావనంది గ్రామంలో  మమత హత్య కేసు విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని  ఏర్పాటు చేస్తూ రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో టి.ఉషా విశ్వనాథ్‌(అడిషనల్‌ డీసీపీ), జి.శ్రీనివాస్‌కుమార్‌ (నిజామాబాద్‌ ఏసీపీ), టి.స్వామి( ఏసీపీ సీసీఎస్‌, నిజామాబాద్‌), వి.శివకుమార్‌(సీఐ, సంగారెడ్డి రూరల్‌), ఎం.ప్రసాద్‌(సీఐ, ధర్పల్లి) ఉన్నారు. మమత కేసు విచారణను వీలైనంత త్వరగా  పూర్తి చేయాలని ప్రత్యేక బృందాన్ని ఆదేశించారు. 


logo