బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 08, 2020 , 01:23:31

మృత్యు పాశాలు

మృత్యు పాశాలు

  • అడవి పందుల  కోసం పెట్టిన విద్యుత్‌తీగలు తగిలి ఇద్దరి దుర్మరణం
  • రెంజల్‌ మండలం దూపల్లిలో ఘటన  

రెంజల్‌ : నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లి గ్రామ శివారులో అడవి పందుల వేటకు వెళ్లిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు మృత్యువాత పడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దూపల్లి గ్రా మానికి చెందిన సుదర్శన్‌రెడ్డి ఆరు ఎకరాల పొలాన్ని అదే గ్రామానికి చెందిన పోతరాజు నవీన్‌కు కౌలుకు ఇచ్చాడు.  పొలంలోకి అడవి పందులు రా కుండా చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చాడు. ఆదివారం రాత్రి అదే గట్టు వైపు నుంచి అడవి పందులను వేటాడేందుకు ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చారు. పొలంలో ఉన్న  అడవి పందిని వేటాడేందుకు ప్రయత్నించేలోపే పొలం చుట్టూ ఉన్న విద్యుత్‌ తీగలకు తాకడంతో ఒక అడవి పంది, ఇద్దరు యువకులు సుమారు (32), (30) అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల సంబం ధించి ఎలాం టి ఆధారాలు దొరకలేదు. వారి వద్ద లభించిన ఫోన్‌లో సి మ్‌కార్డు కూడా లేదు. ఇద్దరి మృతికి కారణమైన పోతరాజు నవీన్‌పై కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు     రెంజల్‌ ఎస్సై సాయినాథ్‌ తెలిపారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రామారావు

దూపల్లి గ్రామ శివారులోని సంఘటనా స్థలాన్ని బోధన్‌ ఏసీపీ రామారావు, బోధన్‌ పట్టణ సీఐ రామన్‌ పరిశీలించారు. విద్యుత్‌ షాక్‌తో మృత్యువాత పడిన యువకుల వివరాల కోసం విచారణ వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 

 రైతు నిర్లక్ష్యానికి ఇద్దరు యువకులు బలైనట్లు చెప్పారు. మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మృతదేహాలను వారం రోజుల పాటు నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో ఉంచుతామని ఏసీపీ రామారావు తెలిపారు. logo