శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Dec 06, 2020 , 01:01:46

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

 • డ్రైవర్‌ నిర్లక్ష్యంతో  హోటల్లోకి దూసుకెళ్లిన వాహనం
 • ముందు వెళ్తున్న బైక్‌ను ఈడ్చుకుంటూ..
 • అక్కడికక్కడే ఒకరి మృతి..దవాఖానకు తరలిస్తుండగా ఇద్దరి దుర్మరణం
 • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
 • ఘటనపై మంత్రి వేముల దిగ్భ్రాంతి

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. మూడు నిండు ప్రాణాలను బలిగొంది. అదుపుతప్పిన వాహనం నేరుగా హోటల్లోకి దూసుకెళ్లగా.. ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌లో శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఒక బైక్‌ నుజ్జునుజ్జవగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

  - భీమ్‌గల్‌ 

 •  డ్రైవర్‌ నిర్లక్ష్యంతో హోటల్లోకి దూసుకెళ్లిన కారు 
 • ముందు వెళ్తున్న బైకును ఈడ్చుకుంటూ.. 
 • అక్కడికక్కడే ఒకరి దుర్మరణం
 • దవాఖానకు తరలిస్తుండగా ఇద్దరు మృతి
 • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 
 • నిజామాబాద్‌ జిల్లా బడాభీమ్‌గల్‌లో ఘటన 

భీమ్‌గల్‌: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. మూడు నిండుప్రాణాలను బలిగొన్నది. వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ ముందు వెళ్తున్న బైక్‌ను ఈడ్చుకుంటూ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే కూర్చున్న ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌నిద్ర మత్తులో డ్రైవింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటుండగా.. అతడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని బడాభీమ్‌గల్‌ గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్‌గల్‌ వైపు నుంచి వస్తున్న కారు బడా భీమ్‌గల్‌కు చేరుకోగానే ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఈడ్చుకుంటూ బీభత్సం సృష్టించింది. అలాగే వెళ్లి అక్కడే ఉన్న ఓ హోటల్‌ గోడను ఢీకొన్నది. దీంతో హోటల్‌లో కూర్చున్న బడా భీమ్‌గల్‌ గ్రామానికి చెందిన పుప్పాల చిన్న రాజన్న (70) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న వేల్పూర్‌కు చెందిన జల్లె భూమన్న(48)తో పాటు మరో ఇద్దరు, హోటల్‌లో కూర్చున్న బడా భీమ్‌గల్‌కు చెందిన వృద్ధురాలు భూదేవి(70) తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే భూమన్నను వేల్పూర్‌ దవాఖానకు, భూదేవిని ఆర్మూర్‌ దవాఖానకు తరలిస్తుండగా ఇద్దరూ మార్గమధ్యంలో మృతి చెందారు. మిగతా ఇద్దరు క్షతగాత్రులను ఆర్మూర్‌ దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నడుపుతున్న మహారాష్ట్రకు చెందిన రాకేశ్‌రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

ఘటనపై మంత్రి వేముల దిగ్భ్రాంతి.. 

బడా భీమ్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్లు  భవనా లు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.          

నిద్రమత్తులో డ్రైవింగ్‌.. 

నిద్రమత్తులో డ్రైవింగ్‌ చేయడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కారు నడుపుతున్న వ్యక్తితోపాటు అందులో ఉన్నవారంతా మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు.

బడా భీమ్‌గల్‌లో విషాదం.. 

ప్రమాదంలో బడా భీమ్‌గల్‌కు చెందిన వృద్ధులు ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతులు భూదేవి, చిన్న రాజన్న ఇరువురు వియ్యంకులవుతారు. వీరి ఇండ్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. కాలక్షేపం కోసం తమ ఇంటి పక్క నే ఉన్న హోటల్‌లో కూర్చొని ముచ్చటిస్తుండగా కారు మృత్యువులా వచ్చి వీరిని బలిగొన్నది. వారి మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటనా స్థలంలో ఉన్నవారందరూ కంటితడిపెట్టారు.  

ప్రాణాలతో బయటపడిన చిన్నారులు.. 

ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.  కారు హోటల్‌లోకి దూసుకురావడానికి కొన్ని క్షణాల ముందే వారు పక్కకు వెళ్లారు. దీంతో అన్నాచెల్లెళ్లకు ప్రాణాపాయం తప్పింది. ఘటనపై మంత్రి వేముల దిగ్భ్రాంతి.. 

బడా భీమ్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్లు  భవనా లు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.