మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Dec 05, 2020 , 00:47:01

సాగు విధానాలు భేష్‌..!

సాగు విధానాలు భేష్‌..!

  • న్యాయవ్యవస్థతో అన్ని శాఖలు  కలిసిరావాలి
  • కార్యనిర్వాహక, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలి
  • న్యాయఫలాలను సామాన్యులకు చేరవేద్దాం
  • జిల్లా జడ్జి సాయిరమాదేవి 
  • అంకాపూర్‌ను సందర్శించిన సంగారెడ్డి జిల్లా ఫెర్టిలైజర్‌ డీలర్లు 
  • ఎర్రజొన్న, సజ్జ, కూరగాయలు, పసుపు పంటల పరిశీలన

ఆర్మూర్‌: అంకాపూర్‌లో రైతులు సాగుచేస్తున్న పంటలు బాగున్నాయని సంగారెడ్డి జిల్లా ఫెర్టిలైజర్‌ డీలర్లు కొనియాడారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డెయిసి (డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫర్‌ ఇన్‌పుట్‌ డీలర్స్‌) శిక్షణలో సంగారెడ్డి జిల్లాకు చెంది న 40 మంది ఫెర్టిలైజర్‌ డీలర్లు పాల్గొన్నారు. మొదట గురడిరెడ్డి రైతు సంఘంలో రైతులతో మాట్లాడి.. వారు పండిస్తున్న పంటలు, సాగు విధానాలు, అవలంబిస్తున్న అధునాతన పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఎర్రజొన్న, సజ్జ, కూరగాయలు, పసుపు పంటలను పరిశీలించారు. అధిక దిగుబడులు సాధించడానికి సాగులో అవలంబిస్తున్న పద్ధతులను రైతులు వారికి వివరించారు. వరి పంటకు బదులు ఆరుతడి పంటలను సాగుచేసి అధిక లాభాలు పొందుతున్నామని రైతులు చెప్పారు. గ్రామంలోని విత్తనోత్పత్తి కేంద్రం, కూరగాయల మార్కెట్‌ను డీలర్లు సందర్శించారు. సంగారెడ్డి ఏవో రమేశ్‌, మాజీ డీడీఏ మహబూబ్‌, గురడిరెడ్డి సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి చిన్న గంగారెడ్డి, మాజీ కార్యదర్శి కేకే భాజన్న తదితరులు పాల్గొన్నారు.


logo