సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Dec 05, 2020 , 00:33:23

న్యాయవ్యవస్థతో అన్ని శాఖలు కలిసిరావాలి

న్యాయవ్యవస్థతో అన్ని శాఖలు  కలిసిరావాలి

  • కార్యనిర్వాహక, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలి
  • న్యాయఫలాలను సామాన్యులకు చేరవేద్దాం
  • జిల్లా జడ్జి సాయిరమాదేవి 
  • 12న జాతీయ లోక్‌ అదాలత్‌
  • జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ సాయిరమాదేవి

నిజామాబాద్‌ లీగల్‌: జాతీయ లోక్‌ అదాలత్‌ను ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ సాయిరమాదేవి తెలిపారు. జిల్లా కోర్టులోని చాంబర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌మహితో కలిసి ఆమె మాట్లాడారు. సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 2,168 సివిల్‌, క్రిమినల్‌ కేసులను గుర్తించామని, రాజీ పడే అవకాశం ఉన్న అన్ని క్రిమినల్‌ కేసులను కక్షిదారుల సమ్మతి మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. వివరాల కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలను, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.


logo