సామాన్యుడిపై ధరాఘాతం

- అటు పెట్రో మంట.. ఇటు గ్యాస్ గుదిబండ
- సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపు
- రూ. 720కి చేరిన సిలిండర్లు సబ్సిడీయేతర
- గ్యాస్ ధరలోనూ పెరుగుదల చిరువ్యాపారులపై
- పెనుభారంనెల రోజులుగా పెరుగుడే తప్ప
- దిగిరాని పెట్రోల్ రేటు పేదల ఆదాయాన్ని
- కొల్లగొడుతున్నకేంద్ర ప్రభుత్వంధరల పెంపుపై
- భగ్గుమంటున్న ప్రజలు
నిత్యవసరం.. అత్యవసరమైన గ్యాస్‌సిలిండర్, పెట్రోల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తి స్తున్నాయి. అమాంతం పెరిగిన ధరలతో సగటు జీవి ఆందోళనకు గురవుతున్నాడు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.50 పెంచిన కేంద్రప్రభుత్వం.. నాన్‌సబ్సిడీ సిలిండర్ ధరను రూ.42 పెంచింది. మరోవైపు పెట్రోల్ ధరలకు పట్టపగ్గాల్లేకుండాపోయాయి. నెల రోజులుగా ధర ఆకాశాన్నంటడం తప్ప కిందికి దిగిరావడంలేదు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలతోపాటు చిరువ్యాపారులు కుదేలవుతున్నారు. కరోనా కారణంగా అంతంతమాత్రంగా నడుస్తున్న వ్యాపారాలపై ధరల పెంపు మరింత ప్రభావం చూపనుంది. కరోనా సంక్షోభ కాలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నెత్తిన కేంద్ర ప్రభుత్వం ధరల భారం మోపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా కాలంలో కనికరం లేదా..
కరోనా కాలంలో ఇంటి ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరను రూ.50 పెంచడం మంచిదికాదు. కేంద్ర ప్రభుత్వం కనికరంలేకుండా సామాన్యులను ఇబ్బందిపెట్టడం మానుకోవాలి.
అటు పెట్రో మంట.. ఇటు గ్యాస్ గుదిబండ
బోధన్ :సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్ ధరలను స్థిరీకరిస్తున్న తీరు ఆయా కుటుంబాల జీవనంపై పెనుప్రభావం చూపుతోంది. అసలే అంతంతమాత్రం ఆదాయంతో నిత్యం ఇబ్బందిపడుతున్న ప్రజలు వంటగ్యాస్, పెట్రోల్ ధరల మోతను మోయలేకపోతున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంహెచ్‌సీ) ఎన్నికల పోలింగ్ ముగియగానే, అదే రోజు రాత్రి సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరను విపరీతంగా పెంచేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.50 పెంచడంతో సామాన్య ప్రజానీకంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ప్రతి నెలాఖరురోజున చమురు కంపెనీలు, కేంద్ర సహజవాయువు, పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గ్యాస్ ధరలపై మదింపు జరుగుతుంది. ఈ లెక్కన.. నవంబర్ 30న గ్యాస్ సిలిండర్ల ధరల స్థిరీకరణ జరగడం, అదే రోజు అర్ధరాత్రి నుంచి ఆ ధరలు అమల్లోకి రావడం జరగాలి.. అయితే, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌లో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతుందోనన్న భయంతో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం అమలును ఒక రోజు వాయిదావేసి, పోలింగ్ ముగియగానే తన నిజస్వరూపం బయటపెట్టుకుంది. ఇప్పటివరకు జిల్లాలో 14.2 కేజీల బరువున్న గ్యాస్ సిలిండర్ ధర రూ.670గా ఉండగా, బుధవారం నుంచి రూ.720కు పెరిగింది. గత ఆగస్టు నుంచి గ్యాస్ సిలిండర్ ధర జిల్లాలో రూ.666 నుంచి రూ.670 మధ్యలో ఉంది. గత మార్చి నుంచి కరోనా, లాక్డౌన్ ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వీరిపాలిట ఒకపక్క వంట గ్యాస్ ధరలు, మరోపక్క పెట్రోల్ ధరలు పెరుగుతుండడం శాపంగా మారింది. మే నెలలో రూ.607గా ఉన్న వంట గ్యాస్ ధర జూన్‌లో రూ.665కు పెరిగింది. జూలైలోనూ అదే ధర కొనసాగింది. ఆగస్టు నుంచి ఆ ధర రూ.666కు పెరిగి నాలుగు నెలలపాటు స్థిరపడింది. ఇప్పుడు అమాంతం ఒకేసారి రూ.50 పెరగడంతో గృహిణుల్లో ఆందోళన పెరిగింది.
కరోనా లాక్డౌన్ ఫలితంగా పెరిగినగ్యాస్ వినియోగం
కరోనా వైరస్ తీసుకొచ్చిన విపత్తు అంతా ఇంతా కాదు.. అనేకమంది సామాన్యులు, మధ్యతరగతి జీవులు ఉపాధికి దూరమయ్యారు. వీరందరిలోనూ కొనుగోలుశక్తి తగ్గింది. ఈ పరిస్థితుల్లో ఆదాయాలు లేక కుటుంబాల పోషణకు ఇబ్బందిపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా, సామాన్యుడి నడ్డి విరిచేలా వంట గ్యాస్ ధరలు పెంచడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేకచోట్ల ప్రజలు సబ్సిడీ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. కరోనా, లాక్డౌన్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో వసతిగృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులంతా ఇండ్లకు చేరుకున్నారు. హైదరాబాద్ తదితర నగరాల్లో చిన్నా, చితక ఉద్యోగాలు చేసుకునేవారు సైతం ఇంటి దారిపట్టారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని అన్ని ఇండ్లలో రోజువారీ తినేవారి సంఖ్య పెరిగిపోయింది. గృహిణులపై వంటభారం విపరీతంగా పెరిగింది. అన్నం, రొట్టెలు, కూరగాయల వినియోగం పెరగడంతో.. సహజంగానే గతంలో కన్నా వంటగ్యాస్ వినియోగం అన్ని ఇండ్లలో పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు చేసుకునేవారు సైతం భార్యాబిడ్డలతో కలిసి జిల్లాలోని గ్రామాల్లో మకాం వేశారు. కుటుంబసభ్యులు పెరగడం, బయట ఆహారం తినాలంటే కరోనా భయం పట్టుకోవడం తదితర కారణాలతో గ్యాస్ వినియోగం పెరిగిందని పలువురు అంటున్నారు. అసలే గ్యాస్ వినియోగం పెరిగిందనుకుంటే.. దానికితోడూ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
- సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపు
- సబ్సిడీయేతర గ్యాస్ ధర సైతం పెంపు
- చిరువ్యాపారులపై పెనుభారం
- నెల రోజులుగా పెరుగుడే
- ఒకేసారి రూ. 50 పెంచడం భారమే
వంట గ్యాస్ ధర ఒకేసారి రూ.50 పెంచడం ఇబ్బందికరంగా ఉంది. రూ.670గా ఉన్న గ్యాస్ తేవడానికి వెళ్తే గ్యాస్ ధర పెరిగిందని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కనీస అవసరంగా మారిన వంటగ్యాస్ ధర పెంచి సామాన్యులపై భారం మోపారు. గతంలో ఫ్రీగా ఇచ్చిన గ్యాస్ డబ్బులను ఈ రకంగా వసూలు చేస్తున్నారు. కేంద్రం ఈ విషయాన్ని గుర్తించి సామాన్యులపై భారం పడకుండా గ్యాస్ ధరను తగ్గించాలి.
-శిరిసెట్టి నాగేశ్వర్రావు, ఎడపల్లి
కమర్షియల్ గ్యాస్ ధరలదీ అదే దారి
సబ్సిడీ వంటగ్యాస్ ధరలనే కాకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలను బుధవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర గత ఏడాది ఇదే కాలంలో రూ.1262గా ఉంది. అప్పటి నుంచి ఈ గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తుండగా.. రెండు నెలల కిందట ఏకంగా ఒకేసారి రూ.50 పెంచారు. ఇక, బుధవారం ఆ గ్యాస్ ధరలో మరో రూ.42 పెరిగింది. వెరసి.. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర ధర రూ.1487కు పెరిగినట్లయింది. ఈ గ్యాస్ ధరల పెరుగుదలతో చిన్న హోటళ్లు, టీస్టాళ్లు, తినుబండారాల దుకాణాలు నడుపుకొనే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం