ధైర్యంగా ఉండండి

- బిగాల కుటుంబీకులను పరామర్శించిన సీఎం కేసీఆర్
- కృష్ణమూర్తి ద్వాదశ దిన కర్మకు హాజరు
- నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆయన కుటుంబీకులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రా వు పరామర్శించారు. ఎమ్మెల్యే స్వగ్రామం మాక్లూర్ మండల కేంద్రానికి బుధవారం వచ్చిన సీఎం... గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆకస్మిక మరణానికి గల కారణాలను గణేశ్ గుప్తా, మహేశ్ గుప్తాను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాతృమూర్తికి, చెల్లెళ్లు వీణ, వాణి, ఇరువురు సోదరుల కు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఇంట్లోకి వెళ్లిన ముఖ్య మం త్రి కొద్ది సేపు కుటుంబీకులతో ముచ్చటించారు. అనంతరం భోజనం చేసి హైదరాబాద్కురోడ్డు మార్గంలో ప యనమయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటన మొత్తంగా షెడ్యూల్ ప్రకారం గంట సేపు కొనసాగింది. సీఎం రాక సందర్భంగా మాక్లూర్‌లో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏ ర్పాట్లు చేసింది. పోలీసుశాఖ గట్టి బందోబస్తును నిర్వహించింది. గ్రామంలో సుందరీకరణ పనులను సీఎం దారి వెంట పరిశీలించారు. కేసీఆర్‌ను చూసేందుకు మాక్లూర్ గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల నుంచి వందలాది మంది ప్రజలు తరలి రావడంతో ఎమ్మెల్యే స్వగ్రామంలో జనసందడి కనిపించింది.
పల్లె ప్రగతిని చూస్తూ...
రోడ్డు మార్గంలో నిజామాబా ద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ మార్గమధ్యం లో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల అమలు తీరు తెన్నులను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11.30 గంటలకు బయలుదేరిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ జాతీయ రహదారి 44 గుండా వయా డిచ్పల్లి, బర్ధిపూర్, బైపాస్ రోడ్డు మీదుగా దా స్‌నగర్ నుంచి మాక్లూర్‌కు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంది. సుమారు రెండున్నర గంట ల ప్రయాణంలో సీఎం కేసీఆర్ ప్రధాన రహదారుల వెంట పల్లె ప్రగతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ ముందుకు సాగారు. జాతీయ రహదారి 44పై సాగిన ప్రయాణంలో సిర్నాపల్లి అడవి అందాలను కేసీఆర్ తిలకించినట్లు సమాచారం. పచ్చని అడవిని చూసి సంబురపడ్డారని తెలిసింది. డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిని దిగిన సీఎం కాన్వాయి పల్లెల గుండా మాక్లూర్‌కు సాగింది. దారి వెంట హరితహారంలో నాటిన మొక్కలు, వాటి రక్షణకు ఏర్పాటు చేసిన కంచెలను సీఎం గమనించారు. మొక్కలను బతికించుకుంటున్న తీరును ఆయన పరిశీలించారు. పల్లె ప్రగతిలో నిరంతరం సాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను సీఎం ప్రత్యక్షంగా వీక్షించడం తో పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్‌ను చూసేందుకు భారీగా జనాలు రోడ్డుకు ఇరువైపులా కనిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. కేసీఆర్ చేతులు ఊపుతూ అభివాదం చేసినప్పుడల్లా దారివెంట ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మాక్లూర్‌కు సీఎం కేసీఆర్ రెండోసారి రాక
మాక్లూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ రెండు సార్లు వచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా గృహ ప్రవేశ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఏప్రిల్ 1, 2016న మాక్లూర్ వచ్చారు. ప్రస్తుతం కృష్ణమూర్తి ద్వాదశ దినకర్మకు హాజరయ్యారు.
తరలివచ్చిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
మాక్లూర్/ఆర్మూర్/నందిపేట్/నందిపేట్ రూరల్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. కృష్ణమూర్తికి నివాళులర్పించడంతో పాటు గణేశ్ గుప్తా, మహేశ్ గుప్తాను పరామర్శించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు సైతం భారీగా వచ్చారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు బిగాల గణేశ్ గుప్తా కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సీనియర్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, సురేందర్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, వీజీ గౌడ్, ఆకుల లలిత, బొగ్గారపు దయానంద్, డీఐజీ శివశంకర్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయ ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ, పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నా యకులు ముజీబుద్దీన్, ఈగ గంగారెడ్డి, సుజీత్ సింగ్ ఠాకూర్, దఫేదార్ రాజు, పోచారం సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, గడుగు గంగాధర్, తాహెర్, మానాల మోహన్‌రెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, కోటపాటి నర్సింహనాయుడు తదితరులు హాజరై కృష్ణమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటన సందర్భంగా మాక్లూర్‌లో పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. డీఐజీ శివశంకర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బందోబస్తులో 463మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ ఏసీపీ రఘు, బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, బోధన్ ఏసీపీ రామారావుతో పాటు 13 మంది సీఐలు, 42 మంది ఎస్సైలు, 401మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు చేపట్టారు.
తాజావార్తలు
- అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా..
- ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ టాప్
- భూక్యా లక్ష్మికి అరుదైన అవకాశం
- భర్తను చంపి అడవిలో పూడ్చి..
- సింధు నిష్క్రమణ
- అందమైన కుటుంబం.. అంతులేని విషాదం..
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్