రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ దుర్మరణం

- ఇంటి నుంచి కాలేజీకి వస్తుండగా ప్రమాదం
- వెనుక నుంచి బైకును ఢీకొన్న టిప్పర్
- సంఘటనా స్థలంలోనే మృత్యువాత
- తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన విద్యార్థులు
డిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజామాబాద్ బైపాస్ రోడ్డులో మంగళవారం ఉదయం పది గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ మేధావి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్(48) దుర్మరణం చెందినట్లు ఎస్సై సురేశ్‌కుమార్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్ నుంచి తన ద్విచక్ర వాహనంపై డిచ్పల్లి శ్రీమేధావి కళాశాలకు వస్తున్న ఆయనను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొన్నది. దీంతో తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన శ్రీకాంత్ చాలా ఏండ్ల నుంచి శ్రీ మేధావి కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. మృతి విషయం తెలుసుకున్న డిచ్పల్లి ఎస్సై సురేశ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. మృతుడు శ్రీకాంత్‌కు భార్య అనిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రిన్సిపాల్ మృత్యువాత వార్త వినగానే శ్రీమేధావి కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటనా స్థలానికి తరలివచ్చి కంటతడి పెట్టారు.
బైక్ అదుపుతప్పి ఒకరు..
నిజాంసాగర్: నిజాంసాగర్-పిట్లం ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామానికి చెందిన మత్తమాల విఠల్(35) మృతి చెందినట్లు ఎస్సై హైమద్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగ్లూర్ గ్రామానికి చెందిన విఠల్‌కు మల్లూర్ గ్రామానికి చెందిన భారతితో పదేండ్ల క్రితం వివాహం అయ్యింది. విఠల్ గతనెల 24వ తేదీన రాత్రి హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైకుపై బయల్దేరాడు. హైదరాబాద్ చేరుకోకపోగా.. అతడి ఆచూకీ తెలియక పోవడంతో అతడి భార్య భారతి గతనెల 26న నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిజాంసాగర్ పోలీసులు, విఠల్ బంధువులు అతడి ఆచూకీ కోసం వెతకసాగారు. మాగి గ్రామానికి చెందిన యువకుడు మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తూ రహదారి వెంట వెళ్తుండగా దుర్గంధం రావడంతో.. లోనికి వెళ్లి గమనించాడు. రహదారి కింది భాగంలో ద్విచక్రవాహనం, విఠల్ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడ లభించిన ఆధారాలతో మృతుడు విఠల్‌గా గుర్తించిన పోలీసులు బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అంచనా వేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.
తాజావార్తలు
- బిగ్‌బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం
- 2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?