పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలి

నిజామాబాద్‌రూరల్: రైతులు తాము తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని జడ్పీ సీఈవో గోవిం ద్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు జిల్లాలోని ఆయా గ్రామాల్లో శనివారం గ్రామసభలు నిర్వహించారు. వ్యవసాయభూముల్లో కల్లాల నిర్మాణం, సాగులో యంత్రపరికరాలు, ఎరువుల వినియోగం, బ్యాంకు రుణాల రెన్యువల్ తదితర అంశాలపై రైతులకు, కోళ్ల పెంపకంపై డ్వాక్రా మహిళలకు అధికారులు అవగాహన కల్పించారు.
భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, జాగిర్యాల్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో జడ్పీ సీఈవో పాల్గొన్నారు. కల్లాలు, ఇంకుడు గుంతలు, పూడికతీత తదితర పనులను పూర్తి చేయాలన్నారు. మోర్తాడ్ మండలంలోని కొడిచర్లలో నిర్వహించిన గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి సోమయ్య పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కల్లాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి, దేగాం, మగ్గిడి, కోమన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి, పేపర్‌మిల్, దండిగుట్ట గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై ఎంపీడీవో గోపాలకృష్ణ, అధికారులు లక్ష్మీకాంత్‌రెడ్డి, ఏపీ వో శరత్ అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు వడ్యాట్, దొన్పా ల్, గాండ్లపేట్‌లో నిర్వహించిన గ్రామసభల్లో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రుద్రూ ర్, వర్ని మండలాల్లోని గ్రామాల్లో నిర్వహిం చిన గ్రామసభల్లో అధికారులు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఇందల్వాయి మండలంలోని రూప్లానాయక్ తండా, చాంద్రాయన్‌పల్లి, గండితండా, నల్లవెల్లి, సిర్నాపల్లి తదితర గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కల్లాల నిర్మాణం, కోళ్ల పెంపకం, రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం తదితర అంశాలపై ఎంపీడీవో రాములునాయక్, ఏవో స్వప్న అవగాహన కల్పించారు. సిరికొండ మండలంలోని న్యావనంది, మైలారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో డీసీవో సింహాచలం వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కోటగిరి మండలంలోని కొల్లూర్‌లో సర్పంచ్ నాగరాణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లిలో నిర్వహించిన గ్రామసభలో మెప్మా పీడీ రాములునాయక్ పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంతోపాటు మనోహరాబాద్, కేశ్‌పల్లి, సికింద్రాపూ ర్ తదితర గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిం చారు. వ్యవసాయాధి కారిణి దేవిక రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ మండలంలోని తిర్మన్‌పల్లిలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో సంజీవ్‌కుమార్ అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చించారు.
తాజావార్తలు
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్