మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Nov 29, 2020 , 02:16:22

గ్రేటర్‌లో ధూంధాం...!

గ్రేటర్‌లో ధూంధాం...!

  • హైదరాబాద్‌ మహానగరంలో ఇందూరు గులాబీ దళం
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం
  • రాజధానికి తరలి వెళ్లిన స్థానిక ప్రజా ప్రతినిధులు
  • ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత
  • సీఎం కేసీఆర్‌ సభతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం

నిజామాబాద్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ : హై దరాబాద్‌ మహా నగరంలో ఎన్నికల వేడి జో రందుకుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రచారపర్వం ఊపందుకుంది. జాతీయ పార్టీలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర సమితి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకు పో తున్నది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జీలుగా నియమించిన మంత్రుల ఆధ్వర్యం లో ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు సమన్వయం తో కలిసికట్టుగా గెలుపు వ్యూహాలను అమ లు చేస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, సురేందర్‌, జీవన్‌ రెడ్డి, షకీల్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటుగా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ముజీబుద్దీన్‌తో పాటు  ఇతర నాయకులంతా గ్రేటర్‌ పోరులో భాగస్వా మ్యం అయ్యారు. ఎమ్మెల్యేల ఆదేశాలతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం హైదరాబాద్‌కు తరలివెళ్లి గులాబీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభ దిగ్విజయంతో శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.  

ప్రచార హోరు...

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నది.వరుసగా రెండోసారి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ సైన్యం పాటుపడుతున్నది.  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో హైదరాబాద్‌కు ఖండాంతరాల ఖ్యాతిని తీసుకువచ్చారు. సైబరాబాద్‌న అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో  పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఒకటా రెండా తలుక్కుమనే భాగ్యనగరం అభివృద్ధితో కొంగొత్తగా కనిపిస్తున్నది. గడిచిన ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకు పోతూ టీఆర్‌ఎస్‌ నేతలు ఓట్లు అడుగుతున్నారు. మరోవైపు కాం గ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు మాత్రం ఎంతసేపు మత రాజకీయాలకు పెద్ద పీట వేస్తూ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ప్రజలను రెచ్చగొట్టడంతో పాటు మత కల్లోలాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తూ ప్రశాంత మహానగరాన్ని విధ్వంస నగరంగా మలిచేందుకు కుట్రలకు దిగుతున్నారు. భారతీయ జనతా పార్టీ చేస్త్తున్న మోసాలను ఎండగడుతూ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన గులాబీ సైన్యం గట్టిగా పని చేస్తు న్నది. అడుగడుగునా కమలం పార్టీ చేస్తోన్న అస త్య ప్రచారాలను తిప్పికొడుతూ కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇ చ్చిన బాధ్యతలతో జిల్లా నుంచి నుంచి వెళ్లిన నాయకులు ఆయా కాలనీల్లో కలియతి రుగు తున్నారు. అక్కడ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రచారం చేస్తున్నారు.   ప్రచారం ముగిసే వరకు ఇన్‌చార్జీలుగా ఉన్నవారంతా పార్టీ కోసం పని చేయాలంటూ పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి వెళ్లిన అధికార పార్టీ నేతలంతా వ్యూహాలతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

అందరి చూపు గ్రేటర్‌వైపే...

హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ ఎన్నికల పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజధాని లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక నేతలకు తోడుగా జిల్లాల నుం చి నాయకులు తరలివెళ్లారు. పోలింగ్‌ సమయానికల్లా అవసరమైన జోరు పెంచేలా తమ అభ్యర్థులను, పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పని చేస్తున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన తొ మ్మి ది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు 15మందికి బాధ్యతల ను అ ప్పగించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు రోజూ పర్యటిస్తున్నా రు. జిల్లా ముఖ్యనేతలతో పాటు అధికార పార్టీ ప్ర జా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఓటర్లకు దగ్గర కావాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. జిల్లా నుంచి వెళ్లిన నాయకులు, మరికొందరు బృందాలుగా విడిపోయి అభ్యర్థుల గె లుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలను సమీకరించడంతో పాటు బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలంటే ఎలా ముందుకెళ్లాలని పార్టీ ము ఖ్య నేతలు వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. మహానగర పాలక సంస్థలో పార్టీ బలం చూపించుకునేలా ప్రచారం సాగించాలని ఇక్కడి నుంచి వెళ్లిన నేతలు స్థానిక కార్యకర్తల సమన్వయంతో ముందుకెళ్తున్నారు.

బీజేపీ మోసాలపై ప్రజల్లోకి...

అడ్డదారిలో గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ కుయుక్తులను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు ఎక్కడికక్కడే నిలువరిస్తున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వారు చాలా మంది ఇండ్లు కట్టుకొని నివాసం ఏర్పర్చుకున్నారు. వీరందరికీ ఇక్కడే ఓట్లు ఉండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగానికి బీజేపీ చేసిన మోసాలను టీఆర్‌ఎస్‌ నేతలు వివరిస్తున్నారు. బీజేపీని నమ్మితే హైదరాబాద్‌ విచ్ఛిన్నానికి పాల్పడడమే తప్ప వికాసానికి తోడ్పాటును అందివ్వబోదని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ చేసిన మోసపూరిత ప్రకటనల సారాంశాలను గ్రేటర్‌ ఓటర్లకు విడమరిచి చెబుతున్నారు. రైతులను బీజేపీ పార్టీ చేసిన మోసాన్ని కళ్లకు కడుతున్నారు. గ్రేటర్‌లో మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తీరును బట్టబయలు చేస్తున్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డును ఐదు రోజుల్లో తెస్తానని చెప్పిన బీజేపీ... ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ఏ విధంగా మొఖం చాటేశారో సవివరంగా వివరిస్తున్నారు. హైదరాబాద్‌ వరదలు మిగిల్చిన నష్టానికి నిధులివ్వలేని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు గిమ్మిక్కులను ఓటర్లకు అర్థమయ్యేలా చెబుతున్నారు.logo