శనివారం 23 జనవరి 2021
Nizamabad - Nov 28, 2020 , 01:27:44

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు

ఆర్మూర్‌/వేల్పూర్‌/శక్కర్‌నగర్‌)/భీమ్‌గల్‌/ధర్పల్లి/ జక్రాన్‌పల్లి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో జిల్లా నుంచి ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి ఇంటింటాప్రచా రం చేస్తున్నారు.  128వ డివిజన్‌లో శుక్రవారం ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..128వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదా బేగం గెలుపు ఖాయమని  అన్నారు. 128 డివిజన్‌కు ఇన్‌చార్జిగా  రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వ్యవహరిస్తున్నారని తెలిపారు.  ప్రచారంలో  రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, ధర్పల్లి మండల కన్వీనర్‌ పీచు రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, జిల్లా నాయకులు గాదారి మోహన్‌రెడ్డి, మండల సర్పంచులు పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండల నాయ కులు కూడా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డి.శ్రీనివాస్‌, సికింద్రాపూర్‌ మాజీ ఎంపీటీసీ కుంచాల రాజు, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్‌ దేవరాజ్‌, కొలిప్యాక్‌ సొసైటీ చైర్మన్‌ గణేశ్‌రెడ్డి, పడకల్‌, బ్రాహ్మణపల్లి ఎంపీటీసీలు సోం గంగారెడ్డి, పోతే రాజు, సికింద్రాపూర్‌ ఉప సర్పంచ్‌ అరుణ్‌ కుమార్‌, కొలిప్యాక్‌ టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు డిష్‌ బాలయ్య, గంగాధ ర్‌ ఉన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు మిట్టాపల్లి మహిపాల్‌, ఎంపీటీసీలు భూమన్న, గంగారెడ్డి, మొండి మహేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సామ మహిపాల్‌, బైరి రవి, నల్ల రమేశ్‌, వెంకటేశ్‌ గౌడ్‌, సామ మహేందర్‌, బబ్బు రు ప్రతాప్‌ ప్రచారం చేశారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఇన్‌చార్జిగా  వ్యవహరిస్తున్న కొండాపూర్‌లో టీఆర్‌ఎస్‌  ఎడపల్లి మండల నాయకులు ప్రచారం చేశారు. 104వ డివిజన్‌  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హమీద్‌ పటేల్‌ తరఫున ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎడపల్లి మండల అధ్యక్షుడు న్యావనంది సుభాష్‌, ఠానాకలాన్‌ సర్పంచ్‌ భాస్కర్‌ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ. వాహబ్‌ (భారీ), ఎల్లయ్య యాదవ్‌ పాల్గొన్నారు. 125వ డివిజన్‌ అభ్యర్థి రావుల శేషగిరికి మద్దతుగా మంత్రి వేముల ఆదేశాల మేరకు భీమ్‌గల్‌ మం డల నాయకులు  పీపీ నగర్‌ కాలనీ, ఎన్టీఆర్‌ నగర్‌, లెనిన్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ  చౌట్‌పల్లి రవి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యు డు మోయిజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్స య్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌  శర్మనాయక్‌, ము న్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భగత్‌ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లో మోర్తాడ్‌ ఎంపీపీ శివలింగుశ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దంరవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా ప్రచారం చేశారు.


logo