సౌదీలో చిక్కుకున్న అంకాపూర్వాసి

- nకారు రిపేరుకు డబ్బులు చెల్లించాలని షేక్ వేధింపులు
- nడబ్బులు, ఉపాధి లేక దీనావస్థలో బాధితుడు
- nప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకుల వేడుకోలు
ఆర్మూర్: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే చిక్కుకున్నాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన కత్తుల స్వామి ఉపాధి కోసం 2014వ సంవత్సరంలో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఓ అరబ్ షేక్ వద్ద కారును అద్దెకు తీసుకొని నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కారు రిపేరుకు వచ్చింది. దీనికి తోడు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా అతడికి జీవనోపాధి కష్టంగా మారింది. అక్కడ ఉండలేనని పాస్‌పోర్టు ఇస్తే ఇండియాకు వెళ్తానని స్వామి షేక్‌తో మొర పెట్టుకున్నాడు. కారు రిపేరుకు వేయి రియాల్స్ చెల్లించాలని షేక్ డిమాండ్ చేస్తున్నాడని స్వామి ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించాడు. తన వద్ద డబ్బులు లేవని, రిపేరుకు వెయ్యి, విమాన టికెట్ కోసం 15 వందల రియా ల్స్ కావాలని స్వామి తెలిపాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడి భార్య నాగమణి కోరుతున్నది. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పట్టణ ఎస్‌హెచ్‌వో పసుల రాఘవేందర్, గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి, అంకాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కిశోర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అప్పటి వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్‌స్టాప్