సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Nov 26, 2020 , 01:43:51

పెండ్లి పత్రిక పెట్టుకోవడానికి వెళ్తూ ఆటో బోల్తా

పెండ్లి పత్రిక పెట్టుకోవడానికి వెళ్తూ ఆటో బోల్తా

  • పెండ్లి కుమారుడితో పాటు  పది మందికి గాయాలు 
  • నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండా వద్ద ఘటన 
  • బాధితులు ఎర్రమన్నుకుచ్చ కాలనీ వాసులు 

నాగిరెడ్డిపేట్‌: లగ్గం పత్రిక పెట్టుకోవడానికి ఆటోలో బయల్దేరిన వారందరూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటన మండలంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్నది. ఎస్సై రాజయ్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీకి చెందిన బుడగ జంగం కులస్తులు పెండ్లి పత్రిక పెట్టుకోవడానికి మెదక్‌ జిల్లా ముత్తాయిపల్లి గ్రామానికి ట్రాలీ ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో నాగిరెడ్డిపేట్‌ మండలం మెల్లకుంటతండా వద్దకు రాగానే ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న పెండ్లి కుమారుడు హరికృష్ణతో పాటు 11 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎస్సై తెలిపారు. డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడంతోనే ఆటో బోల్తా పడిందని పెండ్లి కుమారుడి తండ్రి కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామని పేర్కొన్నారు.


logo