గల్ఫ్ కార్మికులకు సేవలందించిన వారికి సన్మానం

డిచ్పల్లి/ఆర్మూర్: గల్ఫ్ కార్మికులకు సేవలందిస్తున్న మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన జంగం బాలకిషన్‌ను ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ.. బాలకిషన్ 20 ఏండ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న గల్ఫ్ కార్మికులకు సరుకులు, నగదు సాయం అందించడంతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి చికిత్స, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో విమాన టికెట్లు అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దుబాయ్ శాఖ అధ్యక్షుడు వేముల రమేశ్, దుబాయ్ ఇండియన్ పీపుల్స్ ఫోరం ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, సాగర్, భూమేశ్ పాల్గొన్నారు. ఆర్మూర్‌లోని రైతు సేవా కేంద్రంలో ఆదివారం రాత్రి కోటపాటి నర్సింహనాయుడు పలువురిని సన్మానించారు. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో కార్మికులకు అండగా ఉండి వారికి సహాయం అందించిన ఎంఆర్డబ్ల్యూఎఫ్ దుబాయ్ శాఖ అధ్యక్షుడు ఏముల రమేశ్, జనగామ శ్రీనివాస్, కుంబాల మహేందర్‌రెడ్డి, జంగం బాలకిషన్‌ను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, సాగర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
- ఎకరంలో 20 పంటలు.. లాభాలు గడిస్తున్న యువరైతు
- బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సుమ ఫన్ షో.. వీడియో వైరల్
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు