శనివారం 16 జనవరి 2021
Nizamabad - Nov 24, 2020 , 00:42:49

బోధన్‌, నిజామాబాద్‌ రహదారిలో ప్రమాదప్రాంతాల గుర్తింపు

బోధన్‌, నిజామాబాద్‌ రహదారిలో ప్రమాదప్రాంతాల గుర్తింపు

ఎడపల్లి (శక్కర్‌నగర్‌): బోధన్‌, నిజామాబాద్‌ 63వ జాతీయ రహదారిలో 13 కిలోమీటర్ల మధ్యలో మూడు ప్రమాదప్రాంతాలను గుర్తించామని బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌నాయక్‌ తెలిపారు. సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు పక్షం రోజులపాటు ఎడపల్లి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే అనంతరం ఆయన సోమవారం ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎడపల్లి మండలంలోని అలీసాగర్‌, సాటాపూర్‌ గేట్‌, శ్రీదర్శనం ప్రాంతాలను ప్రమాద స్థలాలుగా గుర్తించామన్నారు. ఈ విషయంలో తగు చర్యలకుగాను ఎన్‌హెచ్‌ అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో భాగంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఏడాది  క్రితం జరిగిన 37 ప్రమాదాల్లో 19 మంది మృతి చెందారని తెలిపా రు. ఈ కేసుల్లో 24 బైక్‌లు ఉన్నాయన్నారు. 2020లో ఇప్పటి వరకు 11 కేసులు నమోదైనట్లు చెప్పారు. వాహనదారులు ఇంటి నుంచి బైక్‌పై బయటికి వెళ్లే ముందు హెల్మెట్‌ ధరించాలని, దీంతో ప్రమాదాలు జరిగినా, ప్రాణ నష్టం మాత్రం జరగదన్నారు. సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు బోధన్‌, నిజామాబాద్‌ రహదారిపై నిత్యం వాహనా ల తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకుగాను ఒక ఎస్సైకి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్‌ ఉన్నారు.