గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Nov 21, 2020 , 02:59:09

బాధిత కుటుంబానికి కోటపాటి పరామర్శ

బాధిత కుటుంబానికి కోటపాటి పరామర్శ

శ్రీనివాస్‌ను స్వదేశానికి రప్పిస్తామని భరోసా

ఆర్మూర్‌: పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన మక్కల శ్రీనివాస్‌ బతుకుదెరువు కోసం మలేషియాకు వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్ర వాస భారతీయ హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు బాధిత కుటుంబ సభ్యులను శుక్రవా రం ఆర్మూర్‌లో పరామర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్‌ 14 నెలల క్రితం అప్పుచేసి ఉపాధి కోసం మలేషియాకు వెళ్లాడు. కంపెనీ ఉ ద్యోగం ఉందని చెప్పిన ఏజెంట్‌ మోసం చేసి విజిట్‌ వీసాపై పంపాడు. అతడికి పర్మినెంట్‌ వీసా లేకపోవడం, రూం కూడా లేకపోవడంతో తమిళనాడుకు చెందిన వారి వద్ద నాలుగు నెలల పాటు పని చేశాడు. వారు దొంగతనం ఆపాదించడంతో పాటు చంపాలని చూశారని శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తెలిపాడు. శ్రీనివాస్‌ ప్రస్తుతం అక్కడ తెలిసిన వారి గదిలో తలదాచుకొని తనను ఆదుకోవాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో బాధిత కుటుంబంతో కోటపాటి నర్సింహనాయుడు మాట్లాడారు. అనంతరం దుబాయ్‌ శా ఖ అధ్యక్షుడు ఏముల రమేశ్‌ నుంచి వివరాలు సేకరించి ఇండియన్‌ హై కమిషన్‌కు, తెలుగు సంఘానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో శ్రీనివాస్‌ను త్వరలోనే స్వదేశానికి రప్పిస్తామని బాధిత కుటుంబానికి కో టపాటి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకుడు అర్గుల్‌ సురేశ్‌, తెలంగాణ జాగృతి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మక్కల సాయినాథ్‌, వడ్డెర జేఏసీ జిల్లా నేత పల్లెపు మహేశ్‌, ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు గండికోట రాజన్న తదితరులు ఉన్నారు.