గురువారం 28 జనవరి 2021
Nizamabad - Nov 21, 2020 , 02:59:02

ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు

ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు

డిచ్‌పల్లి: ఓటరు నమోదు కోసం సెలవురోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్‌ ఆర్డీవో రవి తెలిపారు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 సంవత్స రాలు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఇందుకోసం డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. సెలవు రోజులైన ఈ నెల 21, 22 తేదీలతోపాటు డిసెంబర్‌లో 5, 6న ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అక్కడ బీఎల్‌వోలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు తప్పుగా నమోదైనవారి వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌గౌడ్‌, నాయబ్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు..

ధర్పల్లి : ఓటరు నమోదు కోసం మండలంలోని అన్ని గ్రామా ల్లో శని, ఆదివారం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  


logo