సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Nov 19, 2020 , 01:16:35

గ్రేటర్‌ పోరుకు మనోళ్లు

గ్రేటర్‌ పోరుకు మనోళ్లు

డివిజన్లకు ఇన్‌చార్జీలుగా నియామకం

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు

కార్యాచరణను షురూ చేసిన మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మరోమారు గులా బీ జెండాను రెపరెపలాడించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఎన్నికలకు నగారా మోగడంతో పార్టీ అధినేత, ముఖ్యమం త్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మంత్రు లు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ పోరులో ప్రతిపక్ష పార్టీలను చిత్తు గా ఓడించేందుకు సిద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అబద్ధాలే ఎజెండా గా ప్రచారం నిర్వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ తీరును ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పారు. గ్రేటర్‌ ప్రజలకు వరద సాయంగా రూ.10వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా బీజేపీ అడ్డుకున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కీలక సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. మరోవైపు గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జీలుగా టీఆర్‌ఎస్‌ నియమించింది. కుత్బుల్లాపూర్‌, గోషామహల్‌, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని డివిజన్లకు ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఇన్‌చార్జీలుగా ఉన్నారు.

కార్యాచరణ షురూ.. 

గ్రేటర్‌ పోరుకు సమయం తక్కువగా ఉండడంతో సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించిన వెంటనే ప్రజాప్రతినిధులు కార్యాచరణను షురూ చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులతో భేటీ అయ్యారు. ఆయా డివిజన్లలో ప్రచార పర్వంతోపాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ముషీరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రచార కార్యక్రమాలతోపాటు గెలుపే ధ్యేయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ నేపథ్యం లో ప్రతి ఓటరునూ కలిసే విధంగా ప్రణాళికలు రచించారు. ఇతర ప్రజా ప్రతినిధులు సైతం సీఎం ఆదేశాల నేపథ్యంలో కదనరంగంలోకి అడుగు పెట్టారు. 

ఇన్‌చార్జి డివిజన్‌ (నంబర్‌) అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్‌ సెగ్మెంట్‌

వేముల ప్రశాంత్‌ రెడ్డి - రాష్ట్ర మంత్రి గాజుల రామారం (125) కుత్బుల్లాపూర్‌ మల్కాజిగిరి

కల్వకుంట్ల కవిత - ఎమ్మెల్సీ గాంధీనగర్‌ (89) ముషీరాబాద్‌ సికింద్రాబాద్‌

బాజిరెడ్డి గోవర్ధన్‌  - ఎమ్మెల్యే చింతల్‌ (128) కుత్బుల్లాపూర్‌ మల్కాజిగిరి

బిగాల గణేశ్‌గుప్తా - ఎమ్మెల్యే బేగంబజార్‌ (50) గోషామహల్‌ హైదరాబాద్‌

మహ్మద్‌ షకీల్‌ - ఎమ్మెల్యే షేక్‌పేట్‌ (94) జూబ్లీహిల్స్‌ సికింద్రాబాద్‌

ఆశన్నగారి జీవన్‌ రెడ్డి - ఎమ్మెల్యే లంగర్‌హౌస్‌ (66) కార్వాన్‌ హైదరాబాద్‌

గంప గోవర్ధన్‌ - ప్రభుత్వ విప్‌ జీడిమెట్ల (132) కుత్బుల్లాపూర్‌ మల్కాజిగిరి

హన్మంత్‌ షిండే - ఎమ్మెల్యే సుభాష్‌ నగర్‌ (130) కుత్బుల్లాపూర్‌ మల్కాజిగిరి

పోచారం భాస్కర్‌ రెడ్డి -డీసీసీబీ చైర్మన్‌ కుత్బుల్లాపూర్‌ (131 కుత్బుల్లాపూర్‌ మల్కాజిగిరి

జాజాల సురేందర్‌ - ఎమ్మెల్యే కూకట్‌పల్లి (121) కూకట్‌పల్లి మల్కాజిగిరి

దాదాన్నగారి విఠల్‌ రావు - జడ్పీ చైర్మన్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి (119) కూకట్‌పల్లి మల్కాజిగిరి

బీబీపాటిల్‌ - జహీరాబాద్‌ ఎంపీ గోషామహాల్‌ (51) గోషామహల్‌ హైదరాబాద్‌

ముజీబొద్దీన్‌ - టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలాలి (138) మల్కాజిగిరి మల్కాజిగిరిlogo