శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Nov 14, 2020 , 00:58:32

రెడ్డి సంఘ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

రెడ్డి సంఘ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

నిజామాబాద్‌ రూరల్‌ : మండలంలోని గుండారం శివారులో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం కమ్యూనిటీ భవనాన్ని ఈనెల 18న ప్రాంరభించేందుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొల్లెంక గం గారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కోరారు. ఈ మేరకు నగరంలోని ఆయన నివాసానికి శుక్రవారం వెళ్లి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో సంఘం నాయకులు గోపాల్‌రెడ్డి, లింగారెడ్డి, రాజారెడ్డి, నర్సారెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌కు అభినందన..

ఖలీల్‌వాడి: రెడ్‌క్రాస్‌ జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన నిజామాబాద్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నీలి రాంచం దర్‌ను రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు. జాతీయస్థాయిలో రాష్ట్రపతి చేతులమీదుగా నిజామాబాద్‌ జిల్లాకు బంగారు పతకం అందుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. రెడ్‌క్రాస్‌ సేవలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు  తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్నారు.


logo