శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Nov 13, 2020 , 03:51:50

అభివృద్ధి పనులకు ఆకర్షితులై..

అభివృద్ధి పనులకు ఆకర్షితులై..

  • టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు
  • ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

 ఆర్మూర్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున  పోటీ చేసిన సింధుకర్‌ చరణ్‌కుమార్‌ గురువారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు తనతో పోటీ చేసిన తొమ్మిది మంది అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని తెలిపారు. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత , ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, కౌన్సిలర్లు గంగామోహన్‌ చక్రు, ఎస్‌ఆర్‌.సుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు ఖాందేశ్‌ శ్రీనివాస్‌, పండిత్‌ పవన్‌, ఎస్‌ఆర్‌.రమేశ్‌, ఇంతియాజ్‌, వి.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మచ్చర్ల కాంగ్రెస్‌ నాయకుల చేరిక

ఆర్మూర్‌ మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు గురువారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గులాబీ  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు  మహేంద్ర, ద్యావతి నారాయణ, మంథని రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మచ్చర్ల సర్పంచ్‌ నర్సయ్య, ఉప సర్పంచ్‌ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లెల గంగారాం, మండలంలోని పలు గ్రామాలకు చెందిన  టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.