నగరం.. జిగేల్

- స్పైరల్ ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల
ఖలీల్‌వాడి: ఇందూరు నగరం కాంతులీనుతున్నది. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక హంగులు సమకూర్చుతున్నది. ఇందులోభాగంగా నగరంలోని కోర్టు చౌరస్తా, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, హైదరాబాద్ రోడ్డులో స్పైరల్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయగా, వాటిని గురువారం రాత్రి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డివైడర్ల మధ్యలో రకరకాల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అండర్‌గ్రౌండ్ డైనేజీ ఏర్పాటు చేయడంతోపాటు వాటర్ ఫౌంటేన్లు, విశాలమైన రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో హైదరాబాద్ తరహాలో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, రెడ్కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి