మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 13, 2020 , 03:48:22

అర్వింద్‌.. అబద్ధాలు మానుకో..!

 అర్వింద్‌.. అబద్ధాలు మానుకో..!

  • ఎంపీ అంటే మెంబర్‌ ఆఫ్‌ పంచాయతీ కాదు.. మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ అని తెలుసుకో..
  •  తప్పడు ఆరోపణలు చేస్తే  పరువు నష్టం దావా వేస్తా..
  •  సీఎం కేసీఆర్‌ రాష్ర్టాభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి పనిచేస్తున్నారు..
  • విలేకరుల సమావేశంలో  రూరల్‌ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్‌

ఖలీల్‌వాడి: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచి విర్రవీగడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షే మం కోసం పనిచేస్తున్నదని చెప్పారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన ని వాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీపై నిప్పు లు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మాటలు మాత్రమే చెప్పి, ఎలాంటి ఆర్థిక సాయం అందించడంలేదన్నారు. వారి కుటుంబాలను గౌరవించి ఆదుకునే ముఖం కూడా లేదన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఒక యజ్ఞంలా నిర్వహిస్తుంటే బీజేపీ నాయకులు బండి సంజయ్‌, అర్వింద్‌ అడ్డుపడుతున్నారన్నా రు. గతంలో మధుయాష్కీ తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని పదేండ్లు కాలయాపన చేశారని విమర్శించారు. అదేబాటలో ఎంపీ అర్వింద్‌ పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, కనీసం ఇందులో ఒక్క పథకమైన  బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉందా అని ప్రశ్నించారు.

వచ్చే ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చూపెడతామన్నారు. న్యావనందికి చెందిన మమత హత్య కేసు విషయంలో డీజీపీతో మాట్లాడి హంతకులను పట్టుకోవాలని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయం గ్రామస్తులకు కూడా చె ప్పామన్నారు. కానీ ఎంపీ అర్వింద్‌ అసత్య ఆరోపణలు చేస్తూ జోకర్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి పిల్లలకు ఒక్కొక్కరి పేరుమీద రూ.లక్షా 50 వేలు డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. ఎంపీ అంటే మెంబర్‌ఆఫ్‌ పంచాయతీ కాదని, మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ అని తెలుసుకోవాలని సూచించారు. రైతులకు పసుపుబోర్డు తెస్తానని చెప్పి ఏడాది గడిచినా దాని ఊసే ఎత్తడంలేదన్నారు. ఎంపీ అర్వింద్‌ చెప్పేదొకటని, చేసేది మరొకటి అని అన్నారు. ఏడాదిలో ఆయన జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు. రైతులకు మాయమాటలు చెప్పి, వారి ఓట్లతో గెలిచి తరువాత తనకు రైతులు ఓట్లు వేయలేదని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అర్వింద్‌ ఒక్కసారి మాత్రమే గెలిచాడని, తాను 35 ఏండ్ల రాజకీయ చరిత్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. 

తప్పుడు ఆరోపణలు చేస్తే అతనిపై పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా తీరుమార్చుకోవడంలేదన్నారు. ఎంపీ అర్వింద్‌ తండ్రి 30 ఏండ్లలో ప్రజలకు ఏమీ చేయలేదని, ఇప్పుడు కొడుకు కూడా అదే బాటలో నడుస్తున్నాడని విమర్శించారు.  దమ్ముంటే కేంద్రం ద్వారా నిధులు తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు. తన పేరు చెప్పి రౌడీయిజం, భూ కబ్జాలకు పాల్పడితే వారిపై కేసులు పెట్టి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పనిచేసే వారిపై అనవసర ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడని, త్వరలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం జవాన్‌ మహేశ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.