శనివారం 16 జనవరి 2021
Nizamabad - Nov 11, 2020 , 01:43:45

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఇందూరు : తమ సమస్యలను పరిష్కరించాలని గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మూడు సొసైటీల సభ్యులు కలెక్టర్‌ నారాయణరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గీత సంఘాలకు సంబంధం లేని వ్యక్తులను కల్లు డిపోలనుంచి తొలగించాలని, ప్రతి సభ్యుడికీ గుర్తింపు కార్డు అందజేసి పని కల్పించాలని, జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో డీఎల్‌ఎన్‌ గౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, సూరి, బాబూగౌడ్‌, లాలాగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సాయిగౌడ్‌, గంగాధర్‌గౌడ్‌, మల్లేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.