సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Nov 10, 2020 , 02:00:46

‘స్వశక్తీకరణ్‌' చెక్కును అందుకున్న జడ్పీ చైర్మన్‌

‘స్వశక్తీకరణ్‌' చెక్కును అందుకున్న జడ్పీ చైర్మన్‌

నిజామాబాద్‌ సిటీ: దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌ అవార్డుకు ఎంపికైన ని జామాబాద్‌ జడ్పీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50లక్షల చెక్కును సోమవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు చేతుల మీదుగా నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు, జడ్పీ సీఈవో గోవింద్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌  కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తాని యా, కమిషనర్‌ రఘునందన్‌రావు పాల్గొన్నారు. 

నందిపేట్‌ మండలానికి 

రూ. 25 లక్షలు  

నందిపేట్‌ : నందిపేట్‌ మండలం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌ అవార్డుకు ఎంపిక కాగా సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చేతుల మీదుగా రూ. 25 లక్షల చెక్కును ఎంపీపీ వాకిడి సంతోష్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, ఎంపీడీవో నాగవర్ధన్‌  అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి వారిని అభినందించారు.  


logo