మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 09, 2020 , 02:05:07

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు

ఆర్మూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, టీడీపీల నుంచి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకుడు పండిత్‌ పవన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తరలివెళ్లారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుతం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు పెర్కిట్‌ మాజీ వార్డు సభ్యులు ఎండి.ఆసిఫ్‌, నసీరుద్దీన్‌, ఎస్‌కె.ఆసిఫ్‌, చిలుక రాజుతోపాటు వంద మంది ఉన్నారు. హైదరాబాద్‌కు తరలివెళ్లిన వారిలో ఆర్మూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బండారి ప్రసాద్‌ ఉన్నారు.