ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Nov 08, 2020 , 00:18:52

ప్రీ రిపబ్లిక్‌డే పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక

ప్రీ రిపబ్లిక్‌డే పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక

పోటీలను ప్రారంభించిన టీయూ రిజిస్ట్రార్‌

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపిన రిజిస్ట్రార్‌ నసీం

డిచ్‌పల్లి : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో వెస్ట్‌ జోన్‌ రిపబ్లి క్‌ డే పరేడ్‌ - 2021 ఎంపికకు పోటీలను తెలంగాణ విశ్వవిద్యాలయంలోని గెస్ట్‌ హౌస్‌ పరిసర ప్రాంగణంలో శనివారం నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణాబాయి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఎన్‌ఎస్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం స్పోర్ట్స్‌ జెండా ఊపి పరేడ్‌ పోటీలను ప్రారంభించారు. వలంటీర్లు ఎన్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించారు. ఈ పరేడ్‌ పోటీ ప్రక్రియలో పాల్గొన్న వలంటీర్లకు రిజిస్ట్రార్‌ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లకు చెందిన వలంటీర్లు అర్హులని, కరోనా కాలంలో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పరేడ్‌ పోటీల్లో వలంటీర్లు పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పోటీ ల్లో భాగంగా వలంటీర్ల ఎత్తు, ఛాతి, బరువు తీసుకున్నారు. అనంతరం అథ్లెటిక్స్‌లో భాగంగా వెయ్యి మీటర్ల పరుగుపందెం, పరేడ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం సాం స్కృతిక పోటీల్లో వలంటీర్లు జానపద గీతాలు, దేశభక్తి పాటలు, జానపద నృత్యం, మిమిక్రీ, వివిధ భంగిమల్లో డప్పువాయించడం, నృత్యం ప్రదర్శించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ మీద ఎంతవరకు జనరల్‌ అవగాహన ఉందనే అంశంపై పరిశీలించారు. సెలక్షన్‌ కమిటీ సభ్యులుగా ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.ప్రవీణాబాయి, పీఆర్వో డాక్టర్‌ వి.త్రివేణి, రిజర్వు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.అమర్‌జీత్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.అంబర్‌సింగ్‌ వ్యవహరించారు. 

ప్రతిభ చూపిన వలంటీర్లను ఈనెల 20 నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్‌లోని అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు పంపుతామని డాక్టర్‌ ప్రవీణాబాయి తెలిపా రు. అక్కడ పది రోజులు శిక్షణ ఇ స్తారని, ప్రతిభ చూపిన వలంటీర్లు జనవరి 26న ఢిల్లీ లో నిర్వహించే రి పబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు.