సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Nov 07, 2020 , 01:41:12

పేద కుటుంబాలకు సర్కారు అండ

పేద కుటుంబాలకు సర్కారు అండ

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పోచారం సురేందర్‌రెడ్డి

వర్ని(రుద్రూర్‌): ఆడ పిల్లలు ఉన్న పేద కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో 32 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల పెండ్లి చేసే తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిదాసు, తహసీల్దార్‌ విఠల్‌, ఎంపీడీవో బషీరుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిరి, కార్యదర్శి గోపాల్‌, విండో చైర్మన్‌ నామాల సాయిబాబా, వీర్రాజు, ప్రశాంత్‌, సర్పంచ్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.  

కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ..

రుద్రూర్‌: మండల కేంద్రంలో  కల్యాణమండపం పనులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి శుక్రవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండ్లి వేడుకలను ఫంక్షన్‌హాళ్లలో నిర్వహించడం భారంగా మారిందని, రూ.50లక్షల ప్రత్యేక నిధులతో పేదల కోసం స్పీకర్‌ పోచారం శ్రీనిసవాసరెడ్డి కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైతు వేదికను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్‌, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, విండో చైర్మన్‌ సంజీవ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాము, కార్యదర్శి బాలరాజు, సర్పంచ్‌ శేఖర్‌, పీఆర్‌ ఏఈ పవన్‌, గంగారాం, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సంగయ్య పాల్గొన్నారు.    


logo