శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Nov 07, 2020 , 01:24:44

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ నేతలు

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ నేతలు

ముప్కాల్‌ : బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా సీనియర్‌ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కరి కిషన్‌, ధర్మాయి రా జేందర్‌  హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మం త్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులు, ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడంతో పాటు రివర్స్‌ పంపింగ్‌, ఎస్సారెస్పీ పునరుజ్జీవం పనులతో రైతుల నీటి గోసను శాశ్వతం గా పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండ ల అధ్యక్షుడు బద్ధం ప్రవీణ్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు దాసరి వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లింగాగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేంపల్లి చిన్న బాల రాజేశ్వర్‌, మండల ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ సాగర్‌ యాదవ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ ఫయాజ్‌, ఉపసర్పంచ్‌ షేక్‌వాహబ్‌, సొసైటీ డైరెక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌ తదితరులున్నారు. 


logo