సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Nov 06, 2020 , 01:59:01

వామ్మో చలి!

వామ్మో చలి!

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న ది. ఉదయం, సాయంత్రం వేళలో చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల వర కు, సాయంత్రం ఐదు గంటల నుంచే వాతావరణం చల్లగా మారుతున్నది. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్ర మంగా తగ్గుతూ వస్తున్నాయి. గరిష్ఠ ఉ ష్ణోగ్రత కూడా 32.4 డిగ్రీలకు మించ డం లేదు. ఉత్తర దిశ నుంచి చల్లని గా లులు వీయడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకా శం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. గత ఏడాది చలికాలంలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 16.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత గురువా రం నమోదయ్యింది. చలితీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. పలువురు రో గాల బారిన పడి దవాఖానల్లో చేరుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉన్నా.. చలితీవ్రతతో ఇ బ్బందులు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చేవారు స్వెట ర్లు, మంకీ క్యాప్‌లు, జర్కిన్‌లు ధరిస్తున్నారు. రాత్రి వేళలో, ఉదయం పూట చలిమంటలను కాపుకుంటున్నారు. వా తావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో వ్యాధులు త్వర గా ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో మంచు కురుస్తున్నది. ఉదయం వేళలో పొగమంచు కప్పేస్తున్నది. 


logo