బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Nov 06, 2020 , 00:42:00

పట్టు సాధించిన అధికారులు..

పట్టు సాధించిన అధికారులు..

భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో ధరణి సేవలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పుగా, సరికొత్త సంస్కరణగా అమలు చేస్తున్న ఈ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో నాలుగు రోజుల్లోనే అధికార యంత్రాంగం పట్టు సాధించింది. నవంబర్‌ 2వ తారీఖున ప్రారంభమైన ధరణి సేవల్లో దాదాపుగా అన్ని మండలాల్లో వెబ్‌సైట్‌ తెరుచుకోవడంతో పాటు ఇతరత్రా అవస్థల్ని సిబ్బంది దీటుగా ఎదుర్కొంటున్నారు. తలెత్తిన లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చొరవ చూపిస్తున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించి సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్నారు. ఇలా అన్ని మండల కేంద్రాల్లోనూ వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు సాగించే ధరణి విషయంలో అవగాహన పెంచుకుంటున్నారు. మొత్తంగా రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియలో వేగాన్ని చూపించ గలుగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ విధానం ఉభయ జిల్లాల్లో సజావుగా సాగుతున్నది. తొలి రోజున సర్వర్‌ మొరాయింపు, బుకింగ్‌ల సతమతంతో కనిపించిన ఇక్కట్లు తొలిగి వ్యవస్థ గాడిన పడినట్లు కనిపిస్తున్నది. నాలుగు రోజుల వ్యవధిలోనే అనుకున్న విధంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా పరిస్థితి మారుతుండడంతో అటు రైతులతో పాటు ఇటు అధికారుల్లోనూ హర్షం వ్యక్తం అవుతున్నది.logo