బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Nov 06, 2020 , 00:30:58

సులువుగా.. వేగంగా.. ధరణి సేవలు

సులువుగా.. వేగంగా.. ధరణి సేవలు

గతమంతా గందరగోళం.. 
చేతులు జోడించినా పని జరుగని వైనం
ధరణితో రెవెన్యూ వ్యవస్థలో నూతన ఒరవడి 
గాడిలో పడుతున్న రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ
అవాంతరాలు దాటుకుని దిగ్విజయంగా ముందడుగు
ధరణి సేవలపై రెట్టింపు ఆనందంలో సామాన్యులు
lఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న స్లాట్‌ బుకింగ్‌లు 
చిన్న పనికోసమైనా.. ఏండ్లతరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం.. గంటలకొద్దీ పడిగాపులు.. అయినా ఫైలు కదలదు.. పని జరుగదు. రెవెన్యూ వ్యవస్థలోని రెడ్‌టేపిజంతో విసిగి వేసారిన రైతన్నలకు గొప్ప ఊరట-ధరణి పోర్టల్‌. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేచాలు.. అవసరమైన ప్రక్రియలన్నీ దాటుకుని, అరగంటలో పని పూర్తవుతుంది. ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు అవసరం లేదు. ఆఫీసరును బతిమిలాడాల్సిన పనిలేదు. రెవెన్యూ వ్యవస్థలో నూతన ఒరవడికి ‘ధరణి’ శ్రీకారం చుట్టింది. నాలుగురోజులుగా అందుబాటు లోకి వచ్చిన ధరణి సేవలకు ఎల్లడలా ప్రశంసలు దక్కుతున్నాయి. వేగంగా, పారదర్శకంగా ధరణి సేవలు అందుతున్న తీరుపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అవాంతరాలను దాటుకుని రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ గాడిలో పడుతోంది.
- నిజామాబాద్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ


logo