మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 04, 2020 , 01:14:12

అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం

జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో  చేప పిల్లల విడుదల

నిజాంసాగర్‌: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 16.90 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో మొదటి విడుతగా ఆగస్టు నెలలో 31.28 లక్షల చేప పిల్లలను విడుదల చేయగా, రెండో విడుతలో భాగంగా 16.90 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని చెప్పారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. ఆరు సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, అందుకే నేడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.  ప్రస్తుతం కరోనా రెండో దశలోకి ప్రవేశించిందని నిపుణు లు చెబుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులను ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.  కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మ న్‌ దఫేదార్‌ రాజు, కామా రెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ, డీఈ ఈ దత్తాద్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దుర్గారెడ్డి, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, మార్కెట్‌ కమి టీ ఉపాధ్యక్షుడు విఠల్‌, స్థానిక సర్పంచులు అనుసూయ, సంగవ్వ, ఎంపీటీసీ సభ్యుడు దేవీదాస్‌, నాయకులు మనోహర్‌, రమేశ్‌గౌడ్‌, వాజిద్‌అలీ, నర్సింహారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.