మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 03, 2020 , 00:48:49

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత : సుభాష్‌ పత్రీజీ

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత : సుభాష్‌ పత్రీజీ

ఆర్మూర్‌ /గాంధారి : ధ్యానంతోనే మానవునికి ప్రశాంతత లభిస్తుందని ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ అన్నారు. సోమవారం ఆయన ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌లో నిర్వహించిన ధ్యాన సభలో పాల్గొన్నారు. గాంధారి మండలం గొల్లాడీ తండాలో ని ర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ధ్యానం ద్వారా శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఆర్మూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ధ్యాన గురువు రణవీర్‌, ఉపసర్పంచ్‌ బండమీది గంగాధర్‌, ఎంపీటీసీ యాల్ల రాజ్‌కుమార్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేశ్‌ రెడ్డి, ధ్యాన గురువులు పాల్గొన్నారు. గొల్లాడీ తండాలో జడ్పీటీసీ శంకర్‌నాయక్‌, సర్పంచులు  రవీందర్‌, కిషన్‌ నాయక్‌, సుదరీబా యి బిషన్‌,  ఏఎంసీ మాజీ చైర్మన్‌ తాన్‌సింగ్‌, రణవీర్‌, తండావాసులు వసంత్‌రావు, బలరాం, చత్రు, దేవీసింగ్‌  పాల్గొన్నారు.