మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 03, 2020 , 00:48:49

నేటి నుంచి తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు షురూ

నేటి నుంచి తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు షురూ

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ధరణి స్లాట్‌ బుకింగ్‌ సోమవారం ప్రారంభమైంది. దీంతో తహసీల్‌ కార్యాలయాలు బిజీబిజీగా మా రాయి. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న  రైతు లు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వచ్చే అవకాశం ఉండడంతో కార్యాలయాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన పరికరాలు, సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.